Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం కు వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…ఇప్పటి వరకు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ప్రయాణికుల అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి విశాఖ కు వందే భారత్ రైలు నడవడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ లో ఖాజీపేట్ రైల్ కోచ్ ప్రారంభం….చర్లపల్లి లో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రూ 750 కోట్ల పనులతో పున: నిర్మాణ పనులు జరుగుతుందని తెలిపారు. అదే విధానంగా నాంపల్లి లో త్వరలో రూ 350 కోట్ల నిధులతో కొత్త రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా రూ 85 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని అన్నారు.
Read also: NIA Raids: దేశవ్యాప్తంగా 30 చోట్ల ఎన్ఐఏ సోదాలు..
రైల్వే అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. త్వరలో కోమరవేల్లి కొత్త స్టేషన్ కు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. 9 ఏళ్ల పాలనలో దేశంలో వేల కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు.గడిచిన పదేళ్ల పాటు రైల్వే వ్యవస్థ ప్రగతి పథంలో ముందుకు వెళ్లాయన్నారు. జాతీయ బడ్జెట్ లో కేంద్రం రైల్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు మెరుగైన సేవలు అందిస్తున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు 20 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. 85 వేల కోట్ల రైల్వే అభివృద్ధి పనులను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 90 శాతం పూర్తి అయిందని, త్వరలోనే టెర్మినల్ ను అందుబాటులోకి వస్తుందన్నారు.
Read also: NIA Raids: దేశవ్యాప్తంగా 30 చోట్ల ఎన్ఐఏ సోదాలు..
తెలంగాణలో మొదలయ్యే ఈ భారత్ శ్రేణిలో వందే భారత్ రైళు ఇది నాలుగవది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. అయితే, ఇప్పటికే ఈ రెండు స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతుంది. ప్రయాణికుల డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇదే మార్గంలో మరో వందే భారత్ రైలును ప్రవేశ పెట్టారు. రేపటి (మార్చి 13) నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు తొలి సర్వీస్ నడుస్తుంది అన్నమాట. ఇక, మార్చి 15వ తేదీ శుక్రవారం నుంచి సికింద్రాబాద్ – విశాఖ సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇవాళ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ట్రైన్ నంబర్ 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5.05కు బయల్దేరుతుంది.
Read also: Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. గైడ్లైన్స్ ఇవే..
విశాఖపట్నం మధ్యాహ్నం 1. 50 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 20708 విశాఖపట్నం – సికింద్రాబాద్ సర్వీస్ మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖలో బయల్దేరి.. రాత్రి 11.20గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అయితే, వందే భారత్ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5.05కు బయల్దేరి వరంగల్ 6.40, ఖమ్మం 7.45, విజయవాడ 9.10, రాజమండ్రి 11.02, సామర్లకోట 11.45, విశాఖపట్నం 1.50కు బయలుదేరుతుంది. ఒక్కో స్టేషన్‌లో నిమిషం మాత్రమే ఆగుతుంది. విజయవాడలో మాత్రమే ఐదు నిమిషాల హాల్ట్ ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఇందులో ఏడు ఏసీ ఛైర్ కోచ్‌లతో పాటు ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఉంటాయి. ఈ రైలులో దాదాపు 530 మంది ప్రయాణం చేయొచ్చు. ఇక, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది.
Kerala : కేరళలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి.. ఒక్క రోజులోనే 190మంది రోగులు