PM Modi: “కాంగ్రెస్‌కి రిమోట్ కంట్రోల్ పాలన అలవాటు”.. సోనియా గాంధీపై ప్రధాని విమర్శలు..
- రాజ్యసభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ధ్వజం..
- కాంగ్రెస్‌ది రిమోట్ పాలన..
- సోనియా గాంధీపై విమర్శలు..
- ప్రతిపక్షాలు వాకౌట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మంగళవారం లోక్‌సభలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, మరోసారి కాంగ్రెస్‌ని టార్గెట్ చేశారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షాలు జోక్యం చేసుకునేందుకు అనుమతి ఇవ్వడానికి చైర్మన్ జగదీప్ ధంఖర్ నిరాకరించడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
కాంగ్రెస్ మాజీ అధినేత్రి, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు గుప్పించడంపై ప్రతిపక్షాల వాకౌట్ జరిగింది. ‘‘ఈ వ్యక్తులు ఆటో పైలట్, రిమోట్ పైలట్‌లో ప్రభుత్వాన్ని నడపడం అలవాటు చేసుకున్నారు. వారికి పనిచేయడంపై నమ్మకం లేదు. ఎలా వేచి ఉండాలో తెలుసు’’ అని ప్రధాని అన్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని తెరవెనక నుంచి సోనియాగాంధీ నడిపించారని, రిమోట్ పాలన జరిగిందని పలు సందర్భాల్లో బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో ప్రధాని నోటి నుంచి ఈ విమర్శలు వచ్చాయి.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
Read Also: Kalki 2898 AD : కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తాము గత 10 ఏళ్లలో కష్టపడి పనిచేశామని, అభివృద్ధి కోసం ఎలాంటి అవకాశాన్ని వదలలేదని పీఎం అన్నారు. గత 10 ఏళ్లలో కేవలం ఎంపరైజర్ మాత్రమే అని, ఇప్పుడు ప్రధాన వింధు ప్రారంభమైందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగిస్తుండగా, ప్రతిపక్షాలు ‘‘అబద్ధాలు చెప్పడం ఆపండి’’, ‘‘దయచేసి సిగ్గుపడండి’’ అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్షాల తీరుపై ఛైర్మన్ ధంఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నినాదాల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘ అసత్యాలు వ్యాప్తి చేసే వారికి నిజం వినే ధైర్యం లేదు. ఈ విషయాన్ని దేశం మొత్తం గమనిస్తోంది. వారు సమాధానాలు వింటూ కూర్చోలేరు. వారికి అరవడం తప్ప వేరే మార్గం లేదు. వారు సభా సంప్రదాయాలనను అవమానపరుస్తున్నారు’’ అని ప్రధాని అన్నారు. నినాదాలు చేయడం, కేకలు వేయడం, పారిపోవడం ఇది వారి విధి అని అన్నారు. ఎమర్జెన్సీ గురించి ఈ రోజు ప్రధాని ప్రతిపక్షాలపై దాడిని మరింత తీవ్రం చేశారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!