టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లిబియా ఆర్మీ చీఫ్ అలీ కన్నుమూశారు. లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ అలీ మరణవార్తపై ప్రధాన మంత్రి అబ్దుల్‌హమీద్ ద్బీబా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు విమానం స్టేట్స్‌విల్లే ప్రాంతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది.
మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టోలుకా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన శాన్ మాటియో అటెన్కోలో ఒక్కసారిగా విమానం కూలిపోయింది.
విమాన ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, మానవ తప్పిదాలతో ఫ్లైట్స్ ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా వెనిజులాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లోకి టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. వెనిజులాలోని టచిరా రాష్ట్రంలోని పారామిల్లో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక ప్రైవేట్ PA-31 విమానం కూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also…
Plane Crash: హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఒక కార్గో విమానం రన్‌వే నుంచి జారిపడి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది మృతి చెందగా, విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక మీడియా ప్రకారం ఈ విమానం టర్కీకి చెందిన ఎయిర్ ACT ఎయిర్లైన్ది కాగా.. ఎమిరేట్స్ EK9788 అనే ఫ్లైట్ నంబర్‌తో దుబాయ్ నుంచి వచ్చింది. బోయింగ్ 747-481 మోడల్‌కి చెందిన…
విమాన ప్రమాదంలో ప్రముఖ మెక్సికన్ టీవీ హోస్ట్ డెబోరా ఎస్ట్రెల్లా(43) హఠాన్మరణం చెందింది. విమాన ట్రైనింగ్ పొందుతుండగా ఈ ఘోరం జరిగింది. తక్కువ ఎత్తులోనే విమానం ఎగురుతుండగానే కూలిపోయింది. పార్క్ ఇండస్ట్రియల్ సియుడాడ్ మిత్రాస్పైకి దూసుకెళ్లినట్లు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పోలాండ్ ఎయిర్ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఎయిర్ షో రిహార్సల్ చేస్తుండగా ఒక్కసారిగా ఫైటర్ జెట్ కూలిపోయింది. ప్రేక్షకులు చూస్తుండగానే కూలిపోయింది. కిందపడగానే ఒక్కసారి విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున నిప్పులు చెలరేగి ఎఫ్-16 పైలట్ మృతి చెందాడు.
రష్యాలో అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎన్-24 ప్రయాణీకుల విమానం కుప్పకూలిపోయింది. దీంతో విమానంలో ఉన్న ఇద్దరు పిల్లలు సహా 44 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది దుర్మరణం చెందారు.
Air India Flight: ఎయిర్ ఇండియా విమానం ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. 270 మంది ప్రాణాలను తీసిన ఈ ఘోర దుర్ఘనటలో ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు వెళ్లాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం విమానంలో ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే బతికాడు.
కెనడాలో రెండు శిక్షణా విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతుల్లో కేరళకు చెందిన విద్యార్థి పైలట్ శ్రీహరి సుకేష్(21) కాగా.. అతని క్లాస్మేట్ కెనడియన్ పౌరుడు సవన్నామే రోయెస్(20)గా గుర్తించారు.