తిరుమల కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ వస్తువులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లక్షలాదిమంది భక్తులు తిరుమల కొండపైకి ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ తీసుకుని వెళ్లకుండా కట్టుదిట్టమయిన తనిఖీలు నిర్వహిస్తోంది టీటీడీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టారు. కాలినడకన, వాహనాల్లో వస్తున్న భక్తులను అలిపిరి వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్ సీసాలు, కవర్లను స్వాధీనం చేసుకొని పంపించారు. దీంతో అక్కడ డస్ట్ బిన్ అంతా ప్లాస్టిక్ వస్తువులు, బాటిల్స్ తో…
శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలంలో మంగళవారం, శుక్రవారాలలో స్వామివారి ఉచిత స్పర్శదర్శనం వుంటుంది. అయితే ఈ ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేశారు దేవస్థానం అధికారులు. శ్రీ శైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మంగళవారం నుండి శుక్రవారం వరకు భక్తులకు కల్పిస్తున్న మల్లికార్జునస్వామి స్పర్శ దర్శన వేళలు మార్చాలని దేవస్థానం నిర్ణయించింది. నేటినుండి నుంచి వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు…
వేసవి సెలవులు నడుస్తుండడంతో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నామని, స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నామన్నారు.…
శ్రీవారి ఆలయంలో వారపు సేవలు రద్దు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వేసవి శెలవుల సమయంలో సామాన్య భక్తులకు అధిక దర్శన సమయం కేటాయించేందుకు వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చెయ్యగా….వీఐపీ బ్రేక్ దర్శనాలు కొనసాగిస్తూ…స్వామివారికి నిర్వహించే వారపు సేవలు రద్దు చెయ్యడం ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఎంతటి భక్తజన ప్రియుడో….అంతటి అలంకార ప్రియుడు….ఎంతటి అలంకార ప్రియుడో అంతటి ఉత్సవప్రియుడు…అందుకేనేమో శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కాని….అలంకరణ కాని మరే ఆలయంలో…
ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం ఇవాళ తెరుచుకుంది.. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయాన్ని ఇవాళ ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణమధ్య ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.. దీంతో, భక్తులు తన్మయతంలో పులకించిపోయారు. ఈ పవిత్రోత్సవాన్ని తిలకించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Read Also: Movie Tickets: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం.. హైకోర్టు గ్రీన్…
విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలం ఆలయంలో స్వామివారి చందనోత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు తమిళిసై. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు తమిళిసై. తొలిసారి చందనోత్సవంలో పాల్గొన్నాను. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి పవర్ ఫుల్ గాడ్, ఆలయంలో అడుగు పెడితేనే వైబ్రేషన్స్ ఉన్నాయ్ అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై.కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. సాయంత్రం వరకు…
నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమలకు భక్తులతో పాటు అడవుల్లో వుండే వన్యప్రాణులు కూడా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం చిరుతపులులు, ఎలుగుబంట్లు, పాములు, జింకలు ఘాట్ రోడ్లపై కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలలో వన్యప్రాణులు సంచారం కొనసాగుతుంది. సీజన్ బట్టి జంతువులు సంచరిస్తుంటాయి. ఆ మధ్య చిరుతలు….మొన్నటి వరకు ఏనుగులు సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురికాగా….తాజాగా ఎలుగుబంట్లు సంచారం భక్తులుతో పాటు స్థానికులును ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం అర్దరాత్రి సమయంలో ఏకంగా మూడు ఎలుగు బంట్లు…
ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రాణహిత నది పరీవాహకం వెంట పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా హాజరవుతున్నారు. గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలయ్యాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల…
తిరుమలలో స్వామిని సామాన్య భక్తులకు దూరం చేసే కుట్ర ఆలోచనలు బలపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. ఇందుకు తగ్గట్లుగానే టీటీడీ చర్యలు ఉన్నాయన్నారు. ధరలు పెంచాలన్న నిర్ణయంపై ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యాల కల్పన మీద లేదా..? మళ్లీ దర్శనం ఆలోచన కుటుంబాలకు రాకుండా వ్యవహరిస్తున్నారు. ఇది నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వక కుట్రో టీటీడీ సమాధానం చెప్పాలి. స్వామివారి సేవ, భక్తుల సేవ కాకుండా ఎవరి సేవలో తరిస్తున్నారు. శ్రీవారి దర్శనం…
శ్రీవారి భక్తులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రత్యేక దర్శనాలను(Special Darshan) టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.…