గుంటూరులో తొక్కిసలాటపై టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. చంద్రబాబు మాకు ఇదేమీ ఖర్మ..? అని ప్రశ్నించిన ఆయన.. కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చా.. అయినా ఒక్క శాతం కూడా మారలేదు అని మండిపడ్డారు. అసలు డీజీపీకి బుద్ది ఉండొద్దా…? అనుమతులు ఎలా ఇస్తారు..? అని నిలదీశారు.. పది వేల మందికి అనుమతి తీసుకుని నలభై యాభై వేల మందిని తరలించారని ఆరోపించారు.. అసలు, చట్ట విరుద్దమైన సభలకు ఎలా అనుమతి ఇస్తారు అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో అయితే చంద్రబాబుకి 15 ఏళ్ల శిక్ష పడేదన్నారు. ప్రజలకు ఇప్పటికైనా బుద్ది రావాలని పేర్కొన్నారు కేఏ పాల్.
Read Also: Guntur Stampede: చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తోంది..!
చంద్రబాబు ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆరోపిస్తున్నారు.. మరి ఈ విషయం సీఎం జగన్ కూడా ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించు కేఏ పాల్.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకి కూడ అప్పులు ఇప్పిచ్చాననని చెప్పుకొచ్చారు.. అసలు గుంటూరులో తొక్కిసలాట జరిగితే.. తమ్ముడు పవన్ కల్యాణ్ ఏమయ్యాడు? అని ప్రశ్నించారు పాల్.. ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నా స్పందించడా..? అని నిలదీశారు.. సినిమాలేవో చేసుకోవాలి.. పవన్‌కు రాజకీయాలు ఎందుకు అనే తరహా వ్యాఖ్యలు చేశారు.. అయితే, నేను తప్ప ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరని తెలిపారు కేఏ పాల్. కాగా, గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టగా.. చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ చేపట్టారు. చంద్రన్న కానుకల కోసం జనం ఒక్కసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురైయ్యారు.