Lanka villages: లంక గ్రామాల్లో ప్రజల అవస్థలు.. ఆ బ్రిడ్జి వచ్చేదాకా తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాలలో పడవలు, పంట్లు లో ప్రయాణించడం సహజం.. కానీ కాలాలు మారిన అక్కడి వారి కష్టాలు తీరడం లేదు.. దశాబ్దాలు తరబడి వంతెనల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.. అన్నీ పనులు ఆమోదం లభించింది అనుకునే లోపు ఏదో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి… తమ జీవితాలు జీవన ప్రమాణాలు మారవు అని వారికి అర్థం అయిపోయినట్లు ఉంది.. ఈ కష్టాలు తప్పవని డిసైడ్ అయిపోతున్నారు.. బడి పిల్లలు అయితే బిక్కుబిక్కుమంటూ చదువుకోవడానికి వెళ్లాల్సి వస్తుంది.. లంక గ్రామాలలో ఏడో తరగతి వరకే స్కూలు ఉంటుంది.. అక్కడ పాఠాలు చెప్పడానికి వచ్చే మాస్టార్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు.. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకురు నుండి బలుసు తిప్ప గ్రామం వరకు ఉన్న 10 గ్రామాలను, ఐ పోలవరం మండలం గుత్తెనదీవి మూల పొలం కలుపుతూ గోదావరి నది పాయపై వంతెన నిర్మించాలని అనుకున్నారు.. 2009 లో అప్పటి సీఎం వైఎస్ రామాలయంపేట జి మూలపాలెం 350 మీటర్ల వంతెన నిర్మాణానికి 22 కోట్లతో శంకుస్థాపన చేశారు.. ఆ బ్రిడ్జి నిర్మాణానికి పిల్లర్లు వేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించలేదు దానిపై కోర్టుకు వెళ్లడంతో ఆ పనులు అక్కడే ఆగిపోయాయి.. కోర్టు కేసుల తర్వాత ఈ ప్రభుత్వంలో మోక్షం లభించింది.. 2021లో బ్రిడ్జి నిర్మాణం అంచనాని 76 కోట్లకు పెంచుతు ప్రభుత్వం టెండర్లుని ఆహ్వానించింది… కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
Read Also: Biryani new record: బిర్యానీ క్రేజ్ అంతే.. ఏడేళ్లుగా అదే టాప్.. నిమిషానికి 137 ఆర్డర్లు..
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే కాట్రేనికోన మండలం పల్లంకురు పరిసర ప్రాంతాల్లో 30 వేల మందికి ఉపయోగము ఉంటుంది.. ముఖ్యంగా బలుసు తిప్ప పరిసర ప్రాంత మత్స్యకారులు తమ మత్స్య సంపదను అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది.. దాంతోపాటు ఈ మధ్యకాలంలోనే సీఎం గోగుల్లంక వారిదికి శంకుస్థాపన చేశారు.. ఈ వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు.. దాంతో వాటి పనులు కూడా ప్రారంభం కాలేదు.. పడవలు ,పంట్లు మీద దాటించాలంటే లంక గ్రామస్తుల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా రావాలన్నా వెళ్లాలన్న తలకు మించిన భారం అవుతుంది.. హాస్పిటల్ అవసరాల నిమిత్తం వెళ్లే వాళ్ళు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కూడా అవకాశం ఉండడం లేదు.. స్థానికులు తరచూ వాహనాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తీసుకొని వెళ్తున్నారు ఒక్కొక్కసారి ప్రమాదకరం గా ఎక్కువ మందితో ప్రయాణం చేయాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. దాని వలన ఇబ్బందులు తెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.. ఒకవేళ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే దాదాపు 30 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. వరదలు వచ్చినప్పుడు ఏదో హంగామా సృష్టించే అధికారులు ప్రజాప్రతినిధులు తర్వాత అవకాశం ఉన్నప్పుడు కన్నెత్తి కూడా చూడడం లేదు. దాంతో ఇక్కడి స్థానికులకి కష్టాలు అలవాటైపోయాయి.. ఎన్నిసార్లు మొర పెట్టుకున్న ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. ఒక్కొక్కసారి ఆ ప్రవాహంలో పడిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!