YSRCP Leaders: చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Stampede: టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న మరో కార్యక్రమంలోనూ ప్రాణ నష్టం జరిగింది.. గత నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఐదుగురు కార్యకర్తలు అక్కడికక్కడే చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 8కు చేరిన తెలిసిందే కాగా.. తాజాగా, గుంటూరులో అదే సీన్ రిపీట్ అయ్యింది. గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. అయితే, చంద్రబాబు సభ ముగిసిన తర్వాత తొక్కిసలాట జరిగిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టగా.. చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ చేపట్టారు. చంద్రన్న కానుకల కోసం జనం ఒక్కసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురైయ్యారు. అయితే, దీనిపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్.. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.. మరోవైపు.. గుంటూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు హోంమంత్రి తానేటి వనిత.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోం మినిస్టర్.. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రఘాడ సానుభూతిని తెలిపారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.. ఇక, తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు
Also Read
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
అయితే, చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల సమయంలో 30 మందిని పోట్టనపెట్టుకున్నారు అని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సంక్రాంతి కానుకను జగన్ ప్రభుత్వం తొలగించిందని చెప్పడానికే చంద్రబాబు ఇప్పుడు సంక్రాంతి కానుకల కార్యక్రమం నిర్వహించారు.. ప్రజలను చంపి చంద్రబాబు సాధించేది ఎమిటి? అని నిలదారు. వారి కుటుంబాలకు డబ్బులు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబులో మార్పు రావాలని ఆ దేవుడిని ప్రార్థించినట్టు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వ్యాఖ్యానించారు వెల్లంపల్లి శ్రీనివాస్. మరోవైపు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో సభలలో ప్రజలను బలికోనడం బాధాకరం అన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్.. వైఎస్ జగన్ సుధీర్ఘ పాదయాత్ర చేసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదన్న ఆమె.. నిన్నటి ఘటనలో భాధితులుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.. ఇక, చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అరిష్టమేనని మండిపడ్డారు మంత్రి గుమ్మనూరు జయరాం.. గతంలో పుష్కరాలు.. ఇప్పుడు సభలు అప్పుడు ప్రజలు చనిపోతున్నారు.. అందుకే చంద్రబాబుని ప్రజలు ఆదరించడం లేదన్నారు మంత్రి జయరాం..
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!