Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- సర్టిఫికెట్ మాకు అవసరం లేదని వ్యాఖ్య
- పోలీసుల చర్యలపై అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెన్-జీ యువతకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. జెన్-జీ యువతకు మోహన్ భగవత్ నుంచి ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. ‘‘వారికి మోహన్ భగవత్ నుంచి ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదు.’’ అని వ్యాఖ్యానించారు.
జూలై 20న పేపర్ లీకేజీ అంశంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఆయన ఉభయ సభలకు రావడం లేదని ఆరోపించారు. ‘‘ఆయన వచ్చి ప్రకటన చేయాలి. అందులో సమస్య ఏముంది? ఏదైనా తప్పు జరిగితే బాధ్యత తీసుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు.
Also Read
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
మోహన్ భగవత్ గురువారం జెన్-జీ యువతకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. యువత చేస్తున్న ఆందోళనలను దేశ వ్యతిరేక చర్యలుగా చూడకూడదన్నారు. వారి సమస్యలు నిజమైనవేనని, యువత నిజాయితీపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఐఐఎంయూఎన్ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో సుమారు 2,000 మంది జెన్-జీ, జెన్-ఆల్ఫా యువతను ఉద్దేశించి భగవత్ మాట్లాడారు. ‘‘నిరసన కూడా సంభాషణకు ఒక మార్గం. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఏకాభిప్రాయం సాధించే విధానం. భిన్నమైన అభిప్రాయాలు చర్చల ద్వారా కలిసినప్పుడు ఏకాభిప్రాయం ఏర్పడుతుంది.’’ అని అన్నారు. జెన్-జీ యువత ఆందోళన చేస్తే వారు దేశ వ్యతిరేకులు కాదని.. వారు మనవాళ్లు.. మన తర్వాతి తరం. వారితో చర్చలు జరపాలి, సత్సంబంధాలు కొనసాగించాలని స్పష్టం చేశారు.
NEET పేపర్ లీకేజీ ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఆందోళనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో భగవత్ జెన్-జీ, జెన్-ఆల్ఫా యువతతో నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. జెన్-జీ అంటే సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని, జెన్-ఆల్ఫా అంటే 2013 నుంచి 2025 మధ్య జన్మించిన వారిని సూచిస్తారు.
ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల అంశంపైనా మోహన్ భగవత్ స్పందించారు. సామాజిక వివక్షకు గురైన వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. సమాజంలో అసమానతలు కొనసాగుతున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచనలను నిజాయితీగా పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదని.. సామాజిక వివక్షను ఎదుర్కొనేందుకే రిజర్వేషన్ తీసుకొచ్చారని.. సామాజిక వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్ ద్వారా ఇప్పటికే అభివృద్ధి సాధించిన వారు మరింత ప్రయోజనాలను వదులుకుని, అదే అవకాశాలను ఇతర వెనుకబడిన వర్గాలకు అందించే విషయాన్ని కూడా ఆలోచించాలని మోహన్ భగవత్ సూచించారు.
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!