Weight Loss: మారుతున్న జీవన విధానంలో మనిషి శరీరక శ్రమకు దూరం అవుతున్నారు.. కొందరు కనీసం వ్యాయామం చేయడానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు.. చాలామందిని ఊబకాయ సమస్యలు సైతం వెంటాడుతున్నాయి.. అయితే, చాలా మందికి తిండి తగ్గిస్తే చాలు బరువు తగ్గిపోతాం.. రైస్ మానేసి రోటీలు తింటే చాలు ఊబకాయం మాయం అనే అపోహలు ఉన్నాయి.. పక్కింటివారో.. తెలుసినవారు.. ఫ్రెండ్స్.. ఇలా వారు ఇచ్చే సలహాలను గుడ్డిగా ఫాలో అవుతున్నారు.. కొందరైతే.. టీవీల్లో ప్రసారం అయ్యే కార్యక్రమాలను సైతం ఫాలో అవుతున్నారు.. ఆ తర్వాత ఆస్పత్రి పాలవుతున్నారు.. ఇంతకీ.. అయితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.. ఎంత మోతాదులో తీసుకోవాలి.. ఏ ఆహార పదార్థానికి దూరంగా ఉండాలనే విషయంపై ప్రతీ ఒక్కరిలో అవగాహన ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.. అధిక బరువు ఉన్నవారు చపాతీ లేదా రోటీ తినవచ్చా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి బరువు తగ్గాలంటే రోటీ కానీ చపాతీ కానీ తింటే సరిపోతుందా? అనే విషయాల్లోకి వెళ్తే..
Read Also: Rashmika Mandanna: అరెరే రష్మికకు ఎంత కష్టం వచ్చింది.. పాపం
బరువు తగ్గాలనుకునే వారు కేలరీల తీసుకోవడం గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.. రోటీలో కేలరీల శాతం ఎక్కువగా ఉంటుంది.. నిజమే, రోటీ తినడం వల్ల బరువు తగ్గుతామా? పెరుగుతామా? అనే విషయాలపై వైద్యులు కీలక సూచనలు చేస్తున్నారు.. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు రోటీ తినాలా వద్దా అని కంగారు పడితే వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా. ఏదైనా ఆహారాన్ని అవసరానికి మించి తీసుకుంటే సహజంగానే శరీరంలో కేలరీలు పెరుగుతాయి. దీంతో క్రమంగా శరీర బరువు పెరుగుతందని హెచ్చరిస్తున్నారు.. వీలైనంత వరకు నియంత్రణలో వినియోగించడం అలవాటు చేసుకోవాలి. ఇది మన శరీరానికి ఫైబర్, ప్రోటీన్, కొవ్వును అందిస్తుంది. చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుందంటున్నారు..
అయితే, తమ శరీరక బరువును తగ్గించుకోవాలనుకునేవారికి.. తక్కువ నూనె లేదా నెయ్యితో తయారుచేసిన గోధుమ రోటీ చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నమాట.. కానీ, శరీర బరువు పెరగడం లేదా తగ్గడం అనేది వినియోగించే పరిమాణంపై ఆధారపడి ఉంటుందంటున్నారు.. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మనం తీసుకునే ఆహారంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా కీలకమైనది.. అంటే చపాతీ మాత్రమే తినకుండా సబ్జీ, పప్పు వంటివి కూడా తీసుకుంటే బాగుంటుంది. చపాతీ లేదా రోటీని మీ మెనూలో చేర్చుకోండి. కానీ, తక్కువ నూనె లేదా నెయ్యిని వాడాలంటున్నారు వైద్యులు.. అంతేకాదు, ఎలాగూ రోటీయే కదా తినేది అని ఎక్కువ మోతాదులో తీసుకుండా.. తగిన పరిమాణంలో తీసుకోవాలి.. అలాగే సమతులాహారం పాటించడంతోపాటు వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు క్రమంగా అదుపులోకి వస్తుందని.. ఊబకాయం నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.. రైస్ కంటే చపాతి ఎంతో బెటర్ అంటున్నారు.. కానీ, అది కూడా పరిమితంగా ఉండాలని సూచిస్తున్నారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.