పెన్షనర్లకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పెన్షన్‌ను దశల వారీగా పెంచుతామని, మొత్తం రూ. 3,000 అందిస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఆ హామీ మేరకు ఏటా రూ. 250 చొప్పున పెన్షన్‌ను పెంచుతూ వస్తున్నారు.. అందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. పాత లబ్దిదారులే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల మందికి కూడా పెన్షన్ మంజూరు చేసింది సర్కార్.. ఆదివారం…
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న 62.70 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జరగనుంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1,594.66 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలోని 2.66 లక్షల మంది వలంటీర్లు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఐదు రోజుల్లోగా వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పింఛన్ల అందజేతలో అక్రమాలకు తావులేకుండా అధికారులు బయోమెట్రిక్, ఐరిస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కాగా అర్హులైన ప్రతి ఒక్కరికీ…
Andhra Pradesh Volunteers: ఏపీలో ప్రతినెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు వాలంటీర్లే ఇంటింటికీ వెళ్లి ఫించన్ ఇస్తున్నారు. అయితే కొందరు వాలంటీర్స్ అమాయకపు వ్యక్తులను మోసం చేస్తూ బాగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కోసిగి మండలం కామన్ దొడ్డిలో వాలంటీర్లు చేతి వాటం ప్రదర్శించారు. నూతనంగా మంజూరైన ఫించన్ ఇచ్చినట్టే ఇచ్చి ఫోటోలు దిగి వాలంటీర్లు వెనక్కి తీసుకున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫించన్ రావడంతో…
స్వాతంత్ర్య వ్రజోత్సవాల సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది. 76వ స్వాంత్రత్య దినోత్సవ వేడుకల సందర్భంగా 57ఏళ్లు పైబడిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వాటిని నేటి నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9,46,117 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు…
ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవోలను ఏపీ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌వోడీ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏను వర్తింప చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 2022 జనవరి 1 నుంచి హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హెచ్‌ఆర్‌ఏ గరిష్ఠ పరిమితి రూ. 25 వేలకు నిర్ధారిస్తూ ఉత్తర్వులలో అధికారులు స్పష్టం చేశారు. ఏపీ భవన్, హైదరాబాద్‌లలో పనిచేసే…
ప్రభుత్వం అందించే వివిధ రకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హతలుండాలి. అన్ని అర్హతలుండి కూడా ఠంచనుగా వస్తున్న పింఛన్ ఆగిపోతే వారి పరిస్థితి ఎలా వుంటుంది? కోర్టుల ద్వారా న్యాయం జరిగితే ఆ ఆనందానికి అవధులే వుండవు. తన పింఛను కోసం కోర్టుకెక్కిన ఓ వృద్ధురాలు విజయం సాధించింది. పింఛన్ వెంటనే పునరుద్ధరించడంతోపాటు ఎప్పటి నుంచి పింఛను ఆపేశారో ఆ మొత్తం కూడా లెక్కకట్టి ఇవ్వాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి…
ఏపీలో పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుకను ప్రభుత్వం అందించనుంది. జనవరి 1 నుంచి పెంచిన రూ.250 పెన్షన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ.2,500 పెన్షన్ అందనుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం జగన్ ఈ పెంచిన పెన్షన్ కానుకమొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. Read Also: నూతనం.. ప్రారంభం.. ఆరంభం.. అంటూ పవన్ కళ్యాణ్ విషెస్ కాగా జనవరి 1 నుంచి ఐదు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా…