ఏపీలో వేతనాలు, పెన్షన్లపై చీఫ్ సెక్రెటరీ లెక్కలు ఉద్యోగుల్నీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు. 111 శాతం ఖర్చు చేస్తున్నట్టు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు, పించన్లపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని అన్నారు. ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారని, రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఎందుకు ఈ విషయం…
ఏపీ సీఎం జగన్ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. సరస్వతి నగర్‌లో జగన్ బాధితులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తిరుపతి కార్పొరేషన్ సరస్వతి నగర్ లో సీఎం వైయస్ జగన్ ను కలిశారు కిడ్నీ పేషెంట్ బి కుసుమ కుటుంబ సభ్యులు. నడవడానికి ఇబ్బంది పడుతున్న కుసుమ పరిస్థితి చూసి తానే స్వయంగా వాళ్ళ ఇంటిలోనికి వెళ్లిన సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు.…
ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు సీఎస్ సమీర్ శర్మ. సీఎస్ తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో వున్న ఆర్థికేతర అంశాలను తక్షణం పరిష్కరిస్తామని గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన భేటీలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఉద్యోగుల అర్ధికేతర సమస్యల పరిష్కారంపై ఇప్పటికే దృష్టి సారించింది ప్రభుత్వం. ఆర్దిక సమస్యలపై జాయింట్ స్టాఫ్…
ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే చాలు.. ఎక్కడున్నా సరే స్వగ్రామానికి వెళ్లాలి, లేదంటా పెన్షన్ కట్ అవుతుంది అనే టెన్షన్ చాలా మంది వృద్ధులు, ఇతర పెన్షన్ దారుల్లో ఉంటుంది.. పెన్షన్ కోసం ఇతర ప్రాంతల నుంచి స్వగ్రామానికి వెళ్లివచ్చేవారు కూడా లేకపోలేదు.. ఇక, ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్…
నెల మొత్తం పనిచేసి.. ఎప్పుడు తమ ఖాతాల్లో జీతం డబ్బులు పడతాయా? అని ఎదురుచూస్తుంటారు వేతన జీవులు.. ఇక ఫించన్ దారులు పరిస్థితి కూడా అంతే.. తీరా ఆ మొత్తం జమ కావాల్సిన సమయానికి బ్యాంకులకు సెలవు వచ్చాయంటే.. మళ్లీ వర్కింగ్ డే ఎప్పుడా అని చూడాల్సిన పరిస్థితి.. అయితే, ఆ కష్టాలు ఇక ఉండవు.. ఉద్యోగులకు, పెన్షన్ దారులకు రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా వెసులుబాటు కల్పించింది. ఇక మీదట వేతనం, పింఛను డబ్బులు సెలవు…
వృద్ద కళాకారులకు కెసిఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వృద్ధ కళాకారుల నెలవారీ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నెల వారీ పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచుతూ జీవో జారీ చేసింది. జూన్- 2021 నుంచి దీన్ని వర్తింపజేయనుంది ప్రభుత్వం. వృద్ధ కళాకారులకు పింఛన్ పెంపును అమలు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో…