స్వాతంత్ర్య వ్రజోత్సవాల సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది. 76వ స్వాంత్రత్య దినోత్సవ వేడుకల సందర్భంగా 57ఏళ్లు పైబడిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వాటిని నేటి నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9,46,117 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు కానున్నాయి.
అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో 35.95లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా.. కొత్త వారితో కలిపి ఈ సంఖ్య 45.41లక్షలకు పెరగనుంది. అయితే.. కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ నేటి నుంచి ప్రారంభించనున్నారు. దీంతో.. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుందని తెలిపిన ప్రభుత్వం, ఆసరా పింఛన్లతో పాటు ఆసరా కార్డులను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రంలో 57 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామంటూ పేదలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరుతోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 57 ఏళ్లు దాటిన లబ్ధిదారులకు మంత్రి ఈ సందర్భంగా పింఛను గుర్తింపు కార్డులను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 36 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందజేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈనేపథ్యంలో.. మరో 10 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడం ద్వారా సీఎం కేసీఆర్ మరోసారి నిరుపేదల ఆత్మబంధువు అని నిరూపించుకున్నారని తెలిపారు.
CM YS Jagan Reddy Tour: నేడు విశాఖలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..