సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో మాట్లాడారు. పలు అంశాలను కూలంకషంగా వివరించారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత వుంది. చెప్పిన మాటకు కట్టుబడి వుంటాం. రాష్ట్ర విభజనపై అవగాహన లేనివారు ఏదో ఒకటి మాట్లాడుతారు. 2009 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర విభజన చేయలేదు. వంక పెట్టారని వచ్చే ఆరోపణల్ని ఖండిస్తున్నా. బిల్లు పెట్టి పాస్ కాకుంటే మొదటికే మోసం వస్తుందని,…
తెలంగాణలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని తెలిపారు తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారాయన.. ఈ సందర్భంగా ఎన్నికలు, అధికారం గురించి మాట్లాడుతూ.. 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 94 నుంచి 2004 టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీలు పదేళ్లు అధికారంలో…
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువ. అలాంటి పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుయాష్కీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా.. మహేష్‌గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను మహేష్‌గౌడే పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు బీసీ నేతలు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ సఖ్యత లేదు. నిత్యం కయ్యమే. గాంధీభవన్‌లో ఇద్దరు గౌడ్‌లు కలిశారంటే.. ఉప్పు నిప్పులా ఉంటారు. అసలు ఈ ఇద్దరికీ ఎక్కడ తేడా కొట్టింది అనేది ఎవరికీ అంతుచిక్కదు.…
రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో కీలక మార్పులకు PCC కార్యాచరణ సిద్ధం చేస్తుందని టాక్. అందులో ముఖ్యమైంది జిల్లాలకు కొత్త కాంగ్రెస్ సారథుల నియామకం. పార్టీలో సీనియర్ నేతలు.. మాజీ ఎమ్మెల్యేలను డీసీసీలుగా చేస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకంలో ఇదే చేసింది. ఆ ఫార్ములానే కాంగ్రెస్ కూడా ఫాలో అవుతుందనేది టాక్. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ విప్…
తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలతో సత్తా చాటి.. పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.. ఇక, తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ.. మే నెలలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. ఐక్యంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు నేతలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉండాలని చెబుతున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ…
ఆ మధ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన జగ్గారెడ్డి.. మళ్లీ కాస్త వెనక్కి తగ్గారు.. అయితే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. జగ్గారెడ్డిని కలిసి చర్చలు జరపడంతో ఆయన తన ఆలోచన విరమించుకున్నారనే ప్రచారం కూడా సాగింది.. అయితే, రేవంత్ రెడ్డి తనతో జరిగిన చర్చలను ఇవాళ బయటపెట్టారు జగ్గారెడ్డి.. అసెంబ్లీకి రేవంత్ వచ్చాడు.. జగ్గన్న అంటే నేను కూడా కలిశాను.. ఇద్దరూ కలిశారు సినిమా క్లోజ్ అని అనుకున్నారు.. కానీ, లోపలికి రండి అని పిలిచిన రేవంత్‌రెడ్డి..…
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాకు ఝలక్ ఇచ్చుడు కాదు.. నేనే ఝులక్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాకు ఝలక్ ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నాడు.. ఈ పరిణామంతో నన్ను మరింత హట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నాకు రాజకీయ ఝలక్ రేవంత్ ఇచ్చుడు కాదు.. నేను ఇస్తా అని ప్రకటించారు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మజా ఇంకో పార్టీలో ఉండదన్న ఆయన.. రేవంత్ పై బురద జల్లే…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి.. రేవంత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మల్లు రవి.. వీహెచ్ నాకు అన్న లాంటివారు.. కానీ, ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్నానని పేర్కొన్నారు.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కంటే ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అని గుర్తుచేసిన ఆయన.. బీహార్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టులు ఇవ్వొద్దు అని రేవంత్ ఎక్కడా…
భారత రాజ్యాంగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలపై ప్రతిపక్షాలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నాయి.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.. అయితే, ఈ వ్యవహారంలో సీఎంపై అన్ని పీఎస్‌లపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ మాటల వెనక కుట్ర ఉందన్న ఆయన.. నరేంద్ర మోడీ ఆదర్శ నాయకుడు పుతిన్ అయితే.. కేసీఆర్…