Revanth Reddy: కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి స్వీట్ వార్నింగ్..! శాశ్వత బహిష్కరణే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలతో సత్తా చాటి.. పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.. ఇక, తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ.. మే నెలలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. ఐక్యంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు నేతలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉండాలని చెబుతున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఓ వార్నింగ్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి..
Read Also: KTR: టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.. ఆహ్వానం ఉంటేనే రండి..
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
‘కాంగ్రెస్ కు ఐకమత్యమే మహాబలం’ అంటూ ట్వీట్ చేసిన రేవంత్‌రెడ్డి.. “అందుకు భిన్నంగా ఎవరైనా పార్టీ ముఖ్యుల పైన… వివిధ హోదాలలో ఉన్న నాయకుల పైన, బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ, క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు..” అంటూ సున్నితంగా హెచ్చరించారు. ఇక, తన ట్వీట్‌ను కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్కకు ట్యాగ్ చేశారు రేవంత్‌రెడ్డి. కాగా, రాహుల్ గాంధీతో జరిగినే సమావేశంలో.. నేతల మధ్య ఎలాంటి విభేధాలు ఉండకూడదని.. అంతా కలిసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ కు ఐకమత్యమే మహాబలం
అందుకు భిన్నంగా ఎవరైనా పార్టీ ముఖ్యుల పైన…వివిధ హోదాలలో ఉన్న నాయకుల పైన, బహిరంగంగా లేదా సోషల్ మీడియా లో విమర్శలు చేస్తే పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ,క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు.@kcvenugopalmp @manickamtagore @UttamINC @janareddyk @BhattiCLP
— Revanth Reddy (@revanth_anumula) April 17, 2022
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!