Off The Record: ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది….. కానీ దాని పర్యవసానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌పై చర్యల విషయంలో రచ్చ జరిగింది. తర్వాత మంత్రి దంపతులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి క్షమాపణలు చెప్పేశారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయినా… తెర వెనక అసలేం జరిగిందన్న నివేదిక మాత్రం ప్రభుత్వం దగ్గరే ఉండి పోయింది. దీంతో… కొండా ఎపిసోడ్‌లో వాస్తవాలేంటి..? బాధ్యులు ఎవరు,.. బద్నాం అయ్యింది ఎవరు..? సురేఖ…
Off The Record: కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గారెడ్డి. తెలంగాణ పాలిటిక్స్‌లో ఆయన గురించి పరిచయం అవసరం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ప్రభుత్వం … పార్టీ పై వచ్చే ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పారు. మంత్రులు కూడా స్పందించని రోజుల్లో సైతం… అంతా తానై నడిపారాయన. సీఎం రేవంత్‌పై సోషల్ మీడియాతో పాటు బీఆర్‌ఎస్ లీడర్స్ ఎంతలా అటాక్ చేసినా, ఒక దశలో అసభ్యంగా మాట్లాడినా…. ప్రభుత్వంలో ఉన్న…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్. ఉందా.. లేదా అన్నట్టుగా... ఉండీ లేనట్టుగా... అలా అలా బండి లాగించేస్తున్న పార్టీ. అసలు ఒంట్లో బలం ఉందా లేదా అన్నదాంతో... సంబంధం లేకుండా సహజంగా వచ్చే డీఎన్‌ఏ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ని కూడా వేధిస్తున్నాయట. ఐకమత్యం, అందర్నీ కలుపుకునిపోవడం, కలిసి పనిచేయడంలాంటిని కాంగ్రెస్‌లో పెద్దగా కనిపించని లక్షణాలు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పంచాయతీ అంతా.. పదవుల కోసమే. వీలైనంత త్వరలో పిసిసి కమిటీతోపాటు.. కార్పొరేషన్ చైర్మన్స్ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. దీంతో ఆశావాహులంతా పార్టీ నాయకత్వం చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి ట్రయల్స్‌లో వాళ్ళు ఉన్నారు. అంతవరకైతే ఫర్లేదుగానీ.... ఏకంగా గాంధీభవన్లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఛాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు
అదిగో పులి అంటే..... ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారం. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డి అలా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే... ఇలా కేబినెట్ విస్తరణ చర్చలు మొదలవుతాయి రాష్ట్రంలో. వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఇంటా బయటా అవే మాటలు.
గుజరాత్ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ షాకులిస్తోందా? ఒకదానివెంట ఒకటిగా ఇంకా ఇవ్వడానికి స్కెచ్చేస్తోందా? ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఓ బలమైన వర్గం మీద ఫ్రష్‌గా ఫోకస్ పెట్టిందా? ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే.... ఏం జరుగుతుందో లోక్‌సభ ఎన్నికల్లో జ్ఞానోదయం అయిందా? ఇప్పుడు ఎక్కడ కొత్తగా ప్యాచ్ వర్క్ మొదలుపెట్టింది హస్తం పార్టీ? ఆ ఎఫెక్ట్ ప్రతిపక్షాల మీద ఎలా ఉండబోతోంది?
కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర విభాగాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీసీసీ రాష్ట్ర యూనిట్, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల మొత్తం రద్దు ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపారు.