Off The Record: ఇటీవల నల్గొండ నిరుద్యోగ నిరసన సభ జరిగినప్పుడు మీడియాతో చిట్‌చాట్ చేసిన సీనియర్ లీడర్ జానారెడ్డివచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. తన స్థానంలోకుమారుడు బరిలో నిలుస్తారని చెప్పారు. కానీ.. ఇద్దరు కొడుకులు రఘువీర్, జయవీర్‌లో ఎవరన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనే.. కుమారుడిని బరిలో దింపాలని అనుకున్నా… పార్టీ అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జానానే నేరుగా పోటీకి దిగారు. వచ్చే సాధారణ ఎన్నికలు కూడా కాంగ్రెస్…
Off The Record: చాలా రోజుల నుంచి మౌనంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి… నా మనసులో ఆవేదన ఉందంటూ తాజాగా ప్రకటనలు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద తూటాలు ఎక్కుపెట్టారా అన్న అనుమానాలు మొదలయ్యాయట. ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు నాయకులందర్నీ పిలిచి రేవంత్ మాత్రం వదిలేశారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి తన మనసులో ఉన్న విషయాలను వరుసగా ప్రకటనల రూపంలో విడుదల…
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల వివరాలు తమతో చర్చించకుండా కార్యచరణ రూపొందిస్తారని మండి పడ్డారు.
మధుయాష్కీ. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్. గతంలో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ఉన్న జిల్లా నిజామాబాద్. యాష్కీతోపాటు మరో ఇద్దరు కీలక నేతలుకు పీసీసీలో పదవులు ఉన్నాయి. కానీ.. నాయకులంతా ఎవరికివారే. ఇటీవల టీపీసీసీ కమిటీ కూర్పు రాష్ట్రస్థాయిలో నేతలను రెండుగా చీల్చేసింది. మీడియా ముందు ఓపెన్‌గానే విమర్శలు.. సవాళ్లు చేసుకున్నారు నేతలు. ఆ సమస్యపై కాంగ్రెస్ హైకమాండ్ చికిత్స చేస్తున్నా.. పీసీసీ…
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు, నేతల మధ్య వర్గపోరు, అవి బహిర్గతం అవ్వడం.. ఆ తర్వాత సర్దుకుపోవడం.. ఎన్నికల సమయంలో కలిసి పనిచేయడం.. కొన్ని సార్లు మంచి ఫలితాలు వస్తే.. మరికొన్ని సార్లు నష్టపోవడం.. చూస్తూనే ఉన్నాం.. అయితే, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీల నియామకం చిచ్చుపెడుతోంది.. కొత్త కమిటీల్లో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను పక్కనబెట్టి.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి..…
తాజాగా కేంద్ర అధినాయకత్వం ప్రకటించిన కమిటీలు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చిచ్చురేపాయి.. తమకు అన్యాయం జరిగిందంటూ.. సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పీసీసీ-సీఎల్పీ మధ్య అసలు సమన్వయమే లేదు అనేది వారిమాటల్లోనే స్పష్టం అవుతోంది.. ఇదే, సమయంలో పార్టీలో కోవర్టుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.. వీటిపై సీరియస్‌గా స్పందించారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి.. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పిన వాళ్లే ఎవరన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రతీసారి ఈ చర్చ ఎందుకు…
ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి కొత్త టీమ్‌ను ప్రకటించింది ఏఐసీసీ.. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఇవాళ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిశారు.. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఏపీలో పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన గిడుగు రుద్రరాజు.. మాది యంగ్ టీమ్.. పార్టీ బలోపేతం…
పీసీసీ మాజీ చీఫ్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం ముదిరిపోయింది. 2009లోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ వరకు న్యాయపోరాటం చేసిన నాయకులు వీరిద్దరూ. అలాంటిది పదేళ్ల తర్వాత అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకరికొకరు హస్తం అందించుకుని నేస్తమయ్యారు. ఆ సమయంలో వారి మైత్రీని చూసిన వాళ్లంతా ఇద్దరూ కలిసిపోయారనే అనుకున్నారు. కానీ.. తెలంగాణలో పీసీసీ నిర్వహిస్తున్న రచ్చబండ వీరిమధ్య మరోసారి…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ.. పార్టీ అంతర్గతపోరును బయటపెడుతోంది. ఆ జాబితాలో జనగామ కూడా ఎక్కేసింది. ఇక్కడ పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య అస్సలు పడటం లేదు. ఇద్దరూ వేర్వేరుగా రచ్చబండ నిర్వహిస్తున్నారు. కేడర్‌లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. జనగామ కాంగ్రెస్ ఇంఛార్జ్ అనుమతి లేకుండా ప్రతాప్‌రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమాలపై భగ్గుమంటున్న పొన్నాల వర్గం.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఛేస్తూ పీసీసీ…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… అమిత్‌షా హోంమంత్రి లెక్క మాట్లాడలేదు.. చౌకబారు నేత లెక్క మాట్లాడారంటూ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ దోపిడీ చేస్తే… హోం మంత్రిగా అమిత్ షా బాధ్యత మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు కేసీఆర్ అవినీతికి కంచే వేసి కాపాడుతుంది అమిత్ షానే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించిన…