జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా మారిపోయింది జనసేన.. అంతే కాదు.. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం.. జనసేన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది కేంద్ర ఎన్నికల సంఘం
డిప్యూటీ సీఎం అంశంపై జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేసింది.. డిప్యూటీ సీఎం విషయంలో మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ.. ఎవరూ స్పందించవద్దని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంత కాలంగా.. నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ కాకరేపుతోంది.. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం.. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం చేసింది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలని డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తనకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని కోరారు. కాపు రిజర్వేషన్ కోసం హరిరామ జోగయ్య ఎప్పటినుంచో పోరాడుతున్న విషయం తెలిసిందే. ‘8-3-2019 టీడీపీ హయాంలో ఇచ్చిన…
డిప్యూటీ సీఎం అనే పదానికి జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వన్నెతెచ్చారు గానీ.. పవన్ గారికి డిప్యూటీ సీఎం పదవి వల్ల ప్రత్యేక చరిష్మా రాలేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అంటున్నారు. గత సంవత్సరాల అనుభవంలో డిప్యూటీ సీఎంలుగా ఎవరున్నారో తనతో పాటు చాలామందికి తెలియని పరిస్థితి అని, ఈ రోజున దేశం మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం గురించి చర్చిస్తున్నారన్నారు. ఇంతితై వటుడింతై…
విజయవాడ కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం టెంట్ దగ్గర కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే కుర్చీలు వేశారు అధికారులు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంతో పట్టుదలతో జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)ను పర్యవేక్షిస్తున్నారని, ఆయన పని తీరు చూస్తే తనకు అసూయ కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ డిపార్ట్మెంట్ వాళ్లు చేయలేని పనిని చేసే శక్తి ఎన్డీఆర్ఎఫ్కు ఉందన్నారు. జపాన్, నేపాల్, టర్కీ విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అద్భుతమని ప్రశంసించారు. కేంద్రం నుంచి ఇప్పటికే ఏపీకి చాలా సాయం అందిందని, ఇంకా చాలా సహకారం కావాలని అమిత్…
గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేనిదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 1.57 లక్షల ప్రజల ప్రాణాలను జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఇప్పటిదాకా కాపాడిందన్నారు. వసుధైక కుటుంబకం అని ప్రధాని మోడీ చెప్పినట్టుగా 19,365 మూగజీవాలని కాపాడిందని ప్రశంసించారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు గణనీయం పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి సైతం భారత దేశాన్ని…
స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలి అని నిర్ణయించాం.. అందుకే.. అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తం ఒక స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మున్సిపాలిటీలలో స్వచ్ఛతగా ముందుకు వెళ్లలేకపోయామని వెల్లడించారు. కడపలో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. “ఇతర దేశాలలో రోడ్లపై చెత్త వేయరు.. ఇంటికెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారు.. గతంలో నేను ఏ ఊరికి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ లిస్ట్ తీస్తే.. యంగ్ హీరో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపుగా తన ప్రతీ సినిమాలోను పవర్ స్టార్ రెఫరెన్స్ ఉంటుంది. అలాంటిది.. నితిన్ ఏకంగా పవర్ స్టార్ సినిమాకు పోటీగా తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం. వెంకీ కుడుముల దర్శకత్వంలో.. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. వాస్తవానికైతే.. 2024 డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల…