కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయని, ఏపీలో కూడా ‘స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి కోసం కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
ఏపీకి ముందు ముందు మంచి కాలం ఉంది ఆంధ్రప్రదేశ్కు ముందు ముందు మంచి కాలం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబు .. కేంద్రానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల హామీ కాదని.. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్న్యూ్స్ చెప్పింది.…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఏపీలో పర్యటించనున్నారు. శనివారం రాత్రికి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు రానున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు.
బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ గురించి పరిచయం అక్కర్లేదు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాల్లో నటించిన బాబీ డియోల్ ఒక మాటకూడా మాట్లడకుండా తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు. అక్కడి నుండి టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస భారీ సినిమాలో అవకాశాలు అందుకుంటున్నాడు. రీసెంట్ గా బాలయ్య ‘డాకు మహారాజ్’ లో విలన్ గా చేసి తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ‘హరిహర…
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’, పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ మూవీలో నటిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి ఈ రెండు చిత్రాల్లో నటిస్తున్నందు తాను ఎదుర్కొంటున్న సవాళ్లు గురించి పంచుకుంది. నిధి మాట్లాడుతూ ‘ఫస్ట్ లాక్ డౌన్కు ముందే ‘హరిహర వీరమల్లు’ మూవీ కి సైన్ చేశాను. ఈ సినిమాకు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నస్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన ‘మాట వినాలి’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్. “వినాలి.. వీరమల్లు మాట చెప్తే వినాలి” అంటూ…
అప్పుడెప్పుడో ఇంద్ర సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ చిరంజీవి ఇప్పుడు వేస్తున్న పొలిటికల్ స్టెప్స్కు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. కాశీకి వెళ్ళకున్నా... కాషాయం కప్పుకోవడం మాత్రం దాదాపు ఖాయమని అంటున్నారు. కాకుంటే... ఇది రాజకీయ కాషాయం. ఇక వారణాసిలో బతకకున్నా... తన రాజకీయ వరస మాత్రం మార్చుకోబోతున్నారట.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం ముందు కీలక అజెండాను సిద్ధం చేశారు అధికారులు.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతోంది కేబినెట్.. ఇక, మహిళలకు, గీత కులవృత్తిదారులకు గుడ్న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది... ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశారు. జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలోకి దిగితే 21 మంది గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్…