Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డులో పెట్టిన డబ్బు కార్డు కాలం చెల్లినపుడు తిరిగి రాకపోవడంపై మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అమెజాన్ ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గడువు తీరిన వెంటనే వినియోగదారుడి ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యేలా చూడాలని అమెజాన్ కు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేనా ఓ సంచలనం. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆధ్వర్యంలో పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో విపక్ష పార్టీల నుంచి పలువురు నాయకులు జనసేనలోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనసేనాలోకి చేరికలు మొదలయ్యాయి. వైసీపీ నుంచి పలువురు క్షేత్రస్థాయి నాయకులు జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు. జనసేన కేంద్ర కార్యాలయంలో నందిగామ నుంచీ పలువురు వైసీపీ నాయకులు…
మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.. ఈసారి, ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవులు భర్తీ చేయనున్నారు.. రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్.. డైరెక్టర్ల పదవులపై కసరత్తు చేస్తున్నారు.. దేవాలయాల పాలక మండళ్లపై కూడా దృష్టిసారించింది ప్రభుత్వం. ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు పాలక మండళ్లు ఏర్పాటుపై.. జిల్లా…
'జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు.. ఎవరూ అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్. ‘కూటమిలోని మూడు పార్టీల శ్రేణులూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున కూడా ఎవరైనా స్పందించినా, మరెవరూ ప్రతిస్పందించొద్దు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దు. బహిరంగంగా చర్చించొద్దు అని సూచిస్తూ.. జనసేన శ్రేణులకు బహిరంగ లేఖ విడుదల చేశారు పవన్ కల్యాణ్.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో…
జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజులపాటు ప్లీనరీ జరపాలని నిర్ణయించారు.
గత ఏడాది క్రిస్మస్ సీజన్లో భారీ పోటీ ఉంటుందనుకుంటే వార్ వన్ సైడ్ చేసుకుంది పుష్ప 2. కానీ సంక్రాంతికి మాత్రం ఫైట్ తప్పలేదు. త్రీ స్టార్ హీరోస్ బరిలోకి దిగి పీపుల్ విన్నర్ అనిపించుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఉగాదికి కూడా సంక్రాంతి సీనే రిపీట్ కాబోతుందా అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సంక్రాంతికి కోడి పుంజుల్లాంటి మూడు సినిమాలొచ్చాయి. చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ ఢాకూ మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాంతో థియేటర్లను…
తొలిసారి డిప్యూటీ సీఎం ప్రచారంపై స్పందించిన నారా లోకేష్.. తాను రాజకీయంగా సెటిల్గా ఉన్నాను.. ఎన్నికల్లో ప్రజలు మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు.. 94 శాతం సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించారని తెలిపారు.. ఇక, నాకు ప్రస్తుతం చేతి నిండా పని ఉంది.. నాపై బాధ్యత కూడా ఉంది అన్నారు.. తనకు అప్పగించిన శాఖలపై పనిచేస్తున్నాను అన్నారు