Exclusive : ‘హరిహర వీరమల్లు’ అసలే బజ్ లేదు.. పైగా పోస్ట్ పోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఏళ్లకి ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సగభాగం దర్శకత్వం వహించి తప్పుకున్నాడు. మిగిలిన పోర్షన్ కు నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి, పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కానీ ఎందుకనో ఈ సినిమాను ముందు నుండి అనుకున్న బజ్ రావడం లేదు.
స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పాడిన పాట కూడా అంతగా వైరల్ అవలేదు. ఫ్యాన్స్ కూడా OG మాయలో ఉన్నారు తప్ప ఈ సినిమాను వారు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అటు బయ్యర్స్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమా కోసం ఎగబడేంత ఉత్సహం లేదు. అయితే ఈ సినిమాను మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ డేట్ కు దాదాపు రావట్లేదు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ కు సంబంధించి కొంత మేర షూట్ పెండింగ్ ఉంది. మరికొద్దీ రోజుల్లో పవన్ షూట్ లో జయిన్ అవుతారు. ఈ పోర్షన్ షూట్ ఫినిష్ అయ్యేందుకు ఎలా చూసుకున్న కూడా నెల రోజులు పడుతుంది. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసేందుకు మరో నెల. సో మే నెలాఖరు అలాగా హరిహర వీరమల్లు థియేటర్స్ లో అడుగుపెడుతుంది. ఈ ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..