‘రాధే శ్యామ్’తో మెగా క్లాష్… తగ్గేదే లే అంటున్న స్టార్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ ఫైట్ అనేది ఏ భాష అయినా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు మరో భారీ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతోంది. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్స్ తగ్గేదే లేదంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. భీమ్లా నాయక్, రాధే శ్యామ్ రెండు చిత్రాలూ ఒకరోజు గ్యాప్ తో ఒకేసారి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు ‘రాధే శ్యామ్’తో క్లాష్ కాకుండా ఉండడానికి సినిమా విడుదల తేదీని వాయిదా వేయవచ్చని చాలా ఊహాగానాలు వచ్చాయి. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మాత్రం తాము ‘భీమ్లా నాయక్’ను రంగంలోకి దించడంలో ఏమాత్రం వెనుకాడేది లేదంటూ మరోసారి సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. వచ్చే ఏడాది 12న ఈ సినిమా విడుదల కానుంది. రెండు రోజుల తర్వాత జనవరి 14న ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు ‘రాధేశ్యామ్’ విడుదల కూడా వాయిదా పడవచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మరి ‘రాధేశ్యామ్’ వెనకడుగు వేస్తాడా ? లేదంటే ‘భీమ్లా నాయక్’లాగా సినిమా విడుదల తేదీని మరోసారి ఖరారు చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సంక్రాంతి బరిలో తగ్గేది ఎవరు ? నెగ్గేది ఎవరు అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
Read Also : హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ
Also Read
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?