తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని, ఉభయగోదావరి జిల్లాల్లో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఏ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదని, కౌలుదారు చట్టంలో తప్పిదాలు జరిగాయన్నారు. రైతు భరోసాకు కులాలు అంటగట్టడం దుర్మార్గమని, కౌలు రైతులు అల్లాడిపోతున్నారని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నిర్మాత బండ్ల గణేష్ ఎంతటి భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధమంటూ చాలాసార్లు బండ్లన్న బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక మొన్నటికి మొన్న భీమ్లా నాయక్ వేదికపై బండ్ల గణేష్ పవర్ ఫుల్ స్పీచ్ ఉంటుంది అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక ఆ తరువాత జనసేన ఆవిర్భావ సభలో తానూ పాల్గొంటామని బండ్లన్న ట్వీట్ వేయడంతో అక్కడ మిస్ అయినా ఈ…
ఆ పార్టీ నేత అంటే పవన్ కల్యాణ్‌కు ఒళ్లుమంట. అవకాశం దొరికితే చాలు.. ఆ ఎమ్మెల్యేని ఉతికి ఆరేస్తుంటారు. ఆ ఎమ్మెల్యేని ఓడించడానికి.. ఆ పార్టీ అగ్రనేత బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ.. ఆ నియోజకవర్గ చరిత్ర చూస్తే ఆ సామాజికవర్గానికి అక్కడ ఓటమే తప్ప గెలుపు లేదు. అలాంటి సెంటిమెంట్ ఉన్న ఆ నియోజకవర్గంలో ఆ అధినేత పోటీ చేస్తారా? చరిత్రను తిరగరాస్తారా? లేక సాంప్రదాయానికి బలవుతారా? కాకినాడ సిటీ నుంచి జనసేనాని పోటీ…
తిరుపతిలోని చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి తిరుపతి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా, సుమారు 300 అడుగుల లోయలో పడ్డ బస్సు పడిపోయింది. అయితే ఈ ఘటనపై తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. భాకరాపేట లోయలో ప్రమాదం శోచనీయమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారని,…
Bheemla Nayak వెండితెరపైనే కాదు ఓటిటిలోనూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన Bheemla Nayak ఖాతాలో ఇప్పుడు మరో సరికొత్త రికార్డు పడింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ “భీమ్లా నాయక్” చిత్రం ఇటీవలే ఆహా వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అయ్యింది. 4కేతో పాటు డాల్బీ 5.1 సౌండ్ క్వాలిటీతో ఓటిటిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే సినిమాను థియేటర్లో…
మహిళా సాధికారత, ఆర్ధికాభివృద్ధే జనసేన లక్ష్యం అన్నారు నాదెండ్ల మనోహర్. మహిళా ప్రాంతీయ కమిటీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ సిద్ధాంతాలను పునరుద్ఘాటించారు. ఆర్ధికంగా వెనకబడ్డ మహిళలకు ఏడాదికి లక్ష ఆదాయం వచ్చేలా వీర మహిళ విభాగం కృషి చేయాలన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాకో గ్రామం. మహిళా సాధికారత, ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మహిళా శక్తిని మరింత…
Bheemla Nayak మార్చ్ 24 నుంచి ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో ఆల్రెడీ సినిమాను వీక్షించినప్పటికీ మరోమారు ఇంట్లో కూర్చుని Bheemla Nayak మేనియాను ఎంజాయ్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే ఈ పార్టీలో లేట్ గా జాయిన్ అయిన ‘పుష్ప’రాజ్ లేటెస్ట్ పోస్ట్ తో చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్, ఆహా రెండు ఓటిటి ప్లాట్‌ఫామ్ లలో అందుబాటులో ఉంది. ఇక ఆహాలో అయితే సరికొత్త…
సికింద్రాబాద్‌లోని బోయగూడలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు సజీవదహనం అయ్యారు. ఈ విషయం తెలుసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఈ ప్రెస్ నోట్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ తెలుగులోనే ప్రెస్నోట్లను విడుదల చేస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రెస్…
మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టారు. అంతేకాకుండా ఆ ప్రాజెక్ట్ లను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ మరో రీమేక్ పై మనసు పడ్డారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం “బ్రో డాడీ” ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే సినిమా తెలుగు…