ఓట్లు చీలకూడదు.. జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్టు తెలిపారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్… పవన్ కళ్యాణ్ సభకు వెళ్లొద్దని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించిన ఆయన.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 1,019 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. రైతులను ఆదుకుంటూ పర్యటనలు చేస్తున్న పవన్ కల్యాణ్‌ను రాజకీయ కోణంలో చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నాయని పవన కల్యాణ్ రైతుల కోసం రావడం లేదు.. భరోసా ఇచ్చేందుకు వస్తున్నారన్న ఆయన.. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుంది… బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Chandrababu: క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మన నినాదం..
ప్రభుత్వం నుంచి కలుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు అందరూ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు నాదెండ్ల మనోహర్.. జనసేన చేస్తున్న కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయడం లేదు.. ఛాలెంట్ చేస్తున్నా.. గడప గడప కార్యక్రమానికి 2వ తేదీ నుంచి వెళ్లాలన్నారు… వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రోడ్లు, కరెంటు, నీటి సమస్యలపై ప్రజలను వైసీపీ ఎమ్మెల్యేలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారని కామెంట్ చేసిన నాదెండ్ల మనోహర్.. ఏపీ గురించి, రోడ్లు, కరెంటు గురించి పక్క రాష్ట్రాలు మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి జగన్ తీసుకొచ్చారని మండిపడ్డారు.