ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైతు సంక్షేమ యాత్రలో భాగంగా ధర్మవరం, బత్తలపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్న ఆయన.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.. అంతేకాదు.. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనున్నారు జనసేనాని.. సత్యసాయి, అనంతపురం జిల్లాలోని ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి వారిలో ధైర్యం నింపేందుకు రైతుల కోసం తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను మొట్టమొదటగా పవన్ కళ్యాణ్.. ఇవాళ…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ ఏప్రిల్ 14 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడెప్పుడు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ “హరి హర వీర మల్లు”. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ మోడ్లో ఉంది. పవన్ ఇటీవల సెట్స్లో జాయిన్ అయ్యాడు. ఈ పీరియాడిక్ డ్రామాకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. “హరిహర వీర మల్లు” సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లలో జరగనుంది. ఏఎం రత్నం…
Akira Nandan… పవర్ స్టార్ వారసుడి టాలీవుడ్ ఎంట్రీ గురించి అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నోసార్లు అకిరా ఎంట్రీ గురించి రూమర్లు కూడా వచ్చాయి. అయితే రేణూ దేశాయ్ మాత్రం తన కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే తాను ఏమాత్రం అడ్డు చెప్పనని చెప్తూనే రూమర్లకు కూడా పలుమార్లు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే తాజాగా అకిరా బర్త్ డేని పురస్కరించుకుని రేణూ దేశాయ్ తన తనయుడు అకిరా బాక్సింగ్ చేస్తున్న ఓ వీడియోను షేర్…
ముఖ్యమంత్రి జగన్ స్వంత జిల్లా లోని కడప రిమ్స్ లో పసికందుల మరణాలు కలవరపరుస్తున్నాయని, కడప రిమ్స్ ఘటనలో ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పసిబిడ్డల తల్లితండ్రులను పోలీసులతో ఎందుకు తరలించారు? కడప నగరంలోని రిమ్స్ వైద్యాలయంలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు విడిచిన ఘటన మాటలకు అందని విషాదం. విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం లాంటి కారణాలతోనే పసి బిడ్డలు కన్నుమూశారు. ఒక మానిటర్ తోనే 30మంది…
నంద్యాల జిల్లాలో జగన్ వసతి దీవెన సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ వ్యాఖ్యలపై బీజేపీ భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు, పత్రికలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. వారిని ఉద్దేశించి వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ అనడం బాధాకరం అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం బాధాకరం. వెంట్రుక పీకడానికి, గుండు కొట్టించుకోవడానికి సీఎం పదవి ఎందుకు? జగన్…
“ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం హిందీలోనే విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. అయితే తాజాగా “ది కాశ్మీర్ ఫైల్స్” నిర్మాత అభిషేక్ అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. అసలు…
ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సహనం పరీక్షించొద్దంటూ పవన్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న మమ్మల్ని రాక్షసులు.. దుర్మార్గలంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడ్డం సరికాదని, వైసీపీ చేసిన తప్పిదాలనే జనసేన మాట్లాడుతోందనే విషయాన్ని వైసీపీ అగ్ర నాయకత్వం తెలుసుకోవాలన్నారు. నేనూ వైసీపీ నేతల కంటే బలంగా మాట్లాడగలనని, నేను విధానాలపైనే మాట్లాడుతున్నానని.. వైసీపీ అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ వ్యక్తిగత దూషణలకు దిగితే.. ఏ సమయంలో ఎంతివ్వాలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ప్రముఖ కళాదర్శకులు ‘పద్మశ్రీ’ తోట తరణి కళా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం తోట తరణి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ స్పాట్ కి వచ్చిన సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం అందించి హార్ధిక స్వాగతం పలికారు. పద్మశ్రీ పురస్కారాలు, జాతీయస్థాయి ఉత్తమ కళాదర్శక అవార్డులు అందుకున్న తరణి గారి నేతృత్వంలో ఈ చిత్రం సెట్స్ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, మరోపక్క రాజకీయ మీటింగ్ లతో బిజీగా మారారు. సినిమాల పరంగా చుస్తే వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం పవన్ ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం క్రిష్, పవన్ లోని అన్ని కళలను బయటికి తీస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం…