పవన్ కల్యాణ్ ఆరాధ్యదైవమంటూ.. ఈశ్వరా.. పవనేశ్వరా అంటూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటుంటారు నిర్మాత బండ్ల గణేష్. అయితే నిర్మాత బండ్ల గణేష్‌తో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ నన్ను నిర్మాత చేశారు. ఆయన అంటే ఇష్టం.. కానీ జనసేనలో చేరడంలాంటిది ఏమీ లేదన్న బండ్ల గణేష్.. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. అంతేకాకుండా సీఎం కావాలనేదే నా కోరిక అని ఆయన అన్నారు. అయితే.. నేను వైఎస్సాఆర్‌సీపీ పార్టీ నేతలను ఎవ్వరినీ తిట్టలేదని.. నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే గౌరవం.. ఆయనను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని.. అలాగే నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభిమానినే అని ఆయన వ్యాఖ్యానించారు.