పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఒక వైబ్రేషన్.. ఆయనకు జయాపజయాలతో సంబంధం ఉండదు. సినిమాలు చేసినా చేయకపోయినా ఆ క్రేజ్ తగ్గదు. పవన్ కు ఉండేది అభిమానులు కాదు భక్తులు.
ప్రధాని మోడీ పర్యటన విజయవంతం అయ్యిందని.. భీమవరం కార్యక్రమం విజయవంతం కావడంతో భీమ్లానాయక్ గారు బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా
భీమవరంలో జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు పవన్ రాకపోవడాన్ని తప్పుపట్టారు మంత్రి ఆర్కే రోజు.. ఈ కార్యక్రమానికి రావాలని పిలిచినా టైం లేక రాలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అంటున్నారు.. మన్యం వీరుడికి పవన్ ఇచ్చిన విలువ ఎలాంటిదో దీన్ని బట్టి అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు
విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తాము కృషి…
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలకు క్రియాశీలక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన వీర మహిళల శిక్షణ తరగతుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని.. బీజేపీ ఇద్దరు ఎంపీలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇద్దరితో ప్రారంభమైన టీడీపీ ఇప్పుడు ఎవరి అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగలిగే స్థాయికి వచ్చిందన్నారు. మహిళలు ముందుండి నడిపించకుంటే సమాజంలో మార్పు రాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.…