రైతులకు ద్రోహం చేశారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. అమరావతిలో సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయి.. గత ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని పోయి ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా?? వీరందరికీ మా ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా? అని నిలదీశారు.. దీనిపై దత్త పుత్రుడు…
ఏపీలో జనసేన పార్టీ మరో నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేసేందుకు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈనెల 15, 16, 17 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జనసేన చేపట్టనున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ మేరకు తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఆయన డిజిటల్ క్యాంపెయిన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణంగా ఉన్న రహదారులను కనీస మరమ్మతులు కూడా…
పోయినచోటే వెతుక్కోవాలని జనసేనాని చూస్తున్నారా? అందుకే ఆ నియోజకవర్గంపై మళ్లీ ఫోకస్ పెడుతున్నారా? మరోసారి బరిలో దిగుతారా లేక.. అక్కడ పార్టీని బలోపేతం చేస్తారా? కొత్త ప్లాన్ వర్కవుట్ అయ్యేనా? ఏంటా వ్యూహం? లెట్స్ వాచ్..! భీవమరం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోటీ చేయడమే ఆ ఆసక్తికి కారణం. అవే ఎన్నికల్లో గాజువాక నుంచి కూడా పవన్ కల్యాణ్ బరిలో ఉన్నప్పటికీ.. ఎక్కువ…
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మూడో తరం ఇప్పుడు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు, నటుడు శ్రీరామ్ కుమార్తె శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేసి…
విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనసేన ఆధ్వర్యంలో జనవాణి రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టగా స్థానికుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని జనవాణి కార్యక్రమం ద్వారా తాము చేస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కారు తన బాధ్యతలను మర్చిపోయిందని.. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు నేడు నలిగిపోతున్నారని పవన్ ఆరోపించారు. తాను సంపూర్ణంగా ప్రజల పక్షాన నిలబడేందుకు వచ్చానని భరోసా ఇచ్చారు.…
వైసీపీ ప్లీనరీ ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కారం కాదన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష కనీసం మర్యాదపూర్వకంగా ఉండటం లేదని.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం ఫెయిల్యూర్ కావడంతో సీఎం జగన్ ఫస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. 1.27 లక్షల కోట్లు ఏపీలోని రైతాంగాన్ని ఆదుకున్నామని…