Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. అభిమానులను ఆనందపర్చడానికి మేకర్స్ పవన్ నటించిన తమ్ముడు, జల్సా సినిమాలను 4k అల్ట్రా హెచ్ డి లో రిలీజ్ చేస్తున్న విషయం విదితమే. ఇక దీంతో అభిమానుల కోలాహలానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే జల్సా పోస్టర్లను ఫ్లెక్సీలు వేయించి థియేటర్ల ముందు పెట్టడానికి రెడీ అయిపోయారు. అయితే ఈలోపే ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ బ్యాన్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వరకేనా..? లేక మొత్తానికే బ్యాన్ చేస్తున్నారా..? అనేది పక్కన పెడితే.. పవన్ అభిమానులు మాత్రం ఇలాంటి చిన్న చిన్న వాటికి మేము తగ్గేదేలే అంటూ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్లాస్టిక్ ఫ్లెక్సీలు లేకపోతే ఏంటి ..? ఆయిల్ పెయింటింగ్స్ తో థియేటర్స్ కు బయలుదేరుతున్నారు. ఈ రెండు మూడు రోజులోనే పవన్ జల్సా పోస్టర్స్ ను ఆయిల్ పెయింటింగ్స్ తో అభిమానులు తీర్చిదిద్దుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ఇక్కడ .. ఎక్కడా తగ్గేది లేదు అంటూ చెప్పుకోస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆయిల్ పెయింటింగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. థియేటర్స్ వద్ద మునుపెన్నడూ చూడని ఆయిల్ పెయింటింగ్స్ ఫ్లెక్సీలను ప్రేక్షకులు సెప్టెంబర్ 1 న చూడనున్నారు. ఇక ఇదే ట్రెండ్ ను ముందు ముందు అందరూ ఫాలో అవుతారేమో చూడాలి.