HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సినిమాలకు మరికొంత గ్యాప్ ఇచ్చిన పవన్ ప్రస్తుతం రాజకీయాలపైనే దృష్టి సారించాడు. ఇకపోతే పవన్ నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఒక కీలక అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 2 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో పాటు ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇక పోస్టర్ లో వేటకు వెళ్ళేటప్పుడు సింహం కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి పవన్ కళ్లు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కు పండగ రోజు మంచి శుభవార్తను తెలిపారు మేకర్స్. మరోపక్క పవన్ బర్త్ డే నే అతిపెద్ద పండగ అని రచ్చ చేయడానికి రెడీ గా ఉన్నారు. మరి ఆరోజు ఎలాంటి హంగామా చేయనున్నారా చూడాలంటే ఇంటికో రెండు రోజులు ఆగాల్సిందే.