Kartikeya 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానియా గురించి యెంత చెప్పుకున్నా సరిపోదు. ఇక పవన్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కు ఫ్యాన్స్ ఉండరు భక్తులే ఉంటారన్న విషయం విదితమే. ఇక పవర్ స్టార్ బర్త్ డే అంటే వారికి పండగే అని చెప్పాలి. ఈసారి పవన్ వేడుకలను అంగరంగ వైభవంగా చేయడానికి పవన్ ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క పవన్ అభిమానులను అలరించడానికి మేకర్స్ కూడా తమ్ముడు, జల్సా సినిమాలను 4k సౌండ్ తో స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సుమారు 500 పైగా షోలు ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాల కోసం ఆ ఒక్కరోజు మిగిలిన సినిమాలను ఆపేయడానికి థియేటర్ల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం థియేటర్ లో నిఖిల్ కార్తికేయ 2, సీతారామం హిట్ టాక్ తో నడుస్తున్నాయి. కాగా పవన్ సినిమా కోసం ఈ సినిమాలను ఒక రోజు ఆపేస్తున్నారట. కార్తికేయ 2 ప్లేస్ లో జల్సా రిలీజ్ కానున్నదని తెలుస్తోంది. ఆగస్టు 31 న తమ్ముడు, సెప్టెంబర్ 1 న జల్సా రిలీజ్ కానున్నాయి. అయితే ఈ విషయమై నిఖిల్ ను అడుగగా.. పవన్ సినిమా కన్నా మించింది లేదు.. ఒక్కరోజు తన సినిమా ఆపినా పర్లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో నిఖిల్ అచ్చమైన పవన్ ఫ్యాన్ అనిపించుకున్నాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే ఏ థియేటర్ లో ఈ సినిమాను ఆపుతున్నారో తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా పవన్ పాత సినిమా కోసం నిఖిల్ కొత్త సినిమాను పక్కకు తప్పిస్తున్నారన్నమాట. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.