ఓ వైపు సినిమాలు.. మరో వైపు రాజకీయంగా.. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే మళ్లీ కొన్నాళ్లు సినిమాలను పక్కకు పెట్టేసి.. పూర్తిగా పొలిటికల్ పైనే దృష్టి సారించాలి అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న తన కొత్త సినిమాకు డెడ్ లైన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా జరగకపోతే.. నెక్ట్స్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుందని.. చెప్పారట.. మరి పవన్ డెడ్ లైన్ ఎప్పటి వరకు..! రీ ఎంట్రీ…
బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా ఎంతోమందికి సుపరిచితమే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా పవన్ ఫ్యాన్స్ కు తోడు నీడగా ఉంటూ వస్తున్నాడు. పవన్ ను దేవర గా కొలిచే బండ్ల .. నిత్యం ఆయన నామ స్మరణలోనే ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. పవన్ సీఎం కావాలని జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉంటాడు. అయితే గత కొన్ని నెలలుగా…
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు ఎత్తులు.. జిత్తులపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని అనుకుంటున్నారు. ఆ మధ్య కుప్పం పర్యటనలో చంద్రబాబు… జనసేనకు వన్‌సైడ్ లవ్ అని కన్నుగీటారు. ఆ తర్వాత జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మాటలు.. ప్రకటనలతో రెండు పార్టీలు దగ్గరవుతున్నట్టు భావించారు. కానీ.. ఇటీవల నిర్వహించిన మహానాడు తర్వాత టీడీపీ…
పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో గత మూడేళ్లలో 80 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏ ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు పత్రాలు ఇవ్వలేదు. కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు కార్డులు ఉండవని అందరికీ తెలుసు.. ఒక్క సీఎం జగన్ కు తప్ప. మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలోకి రావటానికి ఇచ్చిన…
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలి. విద్యార్థులు ఆందోళన విరమించే దిశగా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ట్రిపుల్ ఐటీలను ఏ లక్ష్యం కోసం స్థాపించారో అది నెరవేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని పవన్ కోరారు. గత కొద్దిరోజులుగా…
పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రకు పవన్ కుటుంబ సభ్యుల ఆర్ధిక చేయూత అందిస్తున్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ.35 లక్షలు విరాళం అందించి తమ ఉదారత చాటుకున్నారు. పవన్ కళ్యాణ్‌ని కలిసి చెక్కులు అందించారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మేము ఇంట్లో ఎప్పుడు కూడా రాజకీయాలు గురించి మాట్లాడుకోం. కుటుంబ సభ్యులుగా రాజకీయాల్లో నేను ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటారు…
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జనసేన పార్టీ అంచనా వేస్తోంది. 2023 మార్చిలో ఎన్నికలు జరుగుతాయని జనసేన పార్టీ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. అక్టోబర్ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అక్టోబరు 5న విజయదశమి సందర్భంగా తిరుపతిలో పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కాగా పవన్ కళ్యాణ్…
అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలైనప్పటినుంచి అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు కురిపించారు. ముంబై మారణ హోమంలో…
సాధారణంగా ఒక స్టార్ స్టేటస్ వచ్చాకా బయట తిరగడం కుదరదు. అది ఎవ్వరైనా సరే .. అభిమానులు చుట్టూ ఉంటూ ఆటోగ్రాఫ్ లు ఫోటోగ్రాఫ్ లు అంటూ వెంటపడుతూ ఉంటారు. అందుకే సెలబ్రిటీలు ఎవరు తెలియని ప్లేస్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తారలు మాత్రం కొద్దిగా రిస్క్ చేసి అయినా తాము చేయాల్సింది చేసేస్తారు.. ప్రస్తుతం కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అదే చేసింది.. ఇటీవల హీరోయిన్ సాయి పల్లవి సినిమా…
తమిళంలో మంచి విజయం సాధించిన ‘వినోదయం సీతమ్’ను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే! ఒరిజినల్‌కి దర్శకత్వం వహించడంతో పాటు అందులో ప్రధాన పాత్రలో నటించిన సముద్రఖని ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు పవన్ 20 రోజుల డేట్స్ ఇచ్చినట్టు గతంలోనూ వార్తలొచ్చాయి. అయితే, ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత రాలేదు. అదిగో, ఇదిగో అంటూ.. యూనిట్ సభ్యులు చెప్పడమే తప్ప, ఇంతవరకూ పట్టాలెక్కలేదు. నిజానికి.. భీమ్లా నాయక్…