Harihara Veeramallu: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురవుతుంటే అని పాడుకొంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఎప్పుడెప్పుడు పవన్ సినిమా అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నవారి పవన్ బర్త్ డే ట్రీట్ వస్తున్నదని తెలియగానే రచ్చ మొదలుపెట్టేశారు. సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ బర్త్ డే.. అభిమానులకు పండగ. ఇక ఈ సెలబ్రేషన్స్ గత వారం రోజుల ముందు నుంచే మొదలై పోయిన సంగతి తెల్సిందే. పవన్ నటించిన తమ్ముడు, జల్సా సినిమాలు రీ రిలీజ్ చేసిన విషయం విదితమే. ఇక పవన్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఇక రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియోను షేర్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ” స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం !!.. సత్యం & ధర్మం యొక్క పరాక్రమ రథసారధి కు అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్ డే.. పవర్ గ్లాన్స్ రేపు సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నాం” అంటూ డైరెక్టర్ క్రిష్ పవన్ కొత్త పోస్టర్ ను షేర్ చేశాడు. ఇక పోస్టర్ లో రథంపై యుద్దానికి వెళ్తున్న హరిహరవీరమల్లుగా పవన్ లుక్ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పుడెప్పుడు ఈ వీడియోను వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
స్వాగతిస్తుంది సమరపథం..
దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం !!Hearty Advance Birthday wishes to our ‘Valorous Charioteer of Truth & Virtue’ #HariHaraVeeraMallu Sri @PawanKalyan garu 💐
The Legendary Heroic Outlaw #HHVM #PowerGlance tomorrow at 5:45pm🔥 pic.twitter.com/2eL0uglku2
— Krish Jagarlamudi (@DirKrish) September 1, 2022