Allu Arjun: మెగాఫ్యామిలీకి- అల్లు ఫ్యామిలీకి మధ్య విబేధాలు నెలకొన్నాయని ఎన్నోరోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై ఇటీవలే అల్లు అరవింద్ ఖండించిన విషయం విదితమే. మా మధ్య అన్నీ మంచి సంబంధాలే ఉన్నాయి, మా మీద రాళ్లు విసరకండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు పవన్ బర్త్ డే. అభిమానులతో పాటు ప్రతి ఒక్క సెలబ్రిటీ ఆయనకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియా లో పోస్ట్స్ చేశారు. ఒక్క అల్లు ఫ్యామిలీ మాత్రమే పవన్ ను విష్ చేయలేదు.
ముఖ్యంగా బన్నీ, పవన్ కు విష్ చేయకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనకు తామెప్పుడు సపోర్ట్ గా ఉంటామని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు బన్నీ. ఆగస్టు 22 న మెగాస్టార్ బర్త్ డే కు బన్నీ విషెస్ తెలిపాడు. మరి పవన్ బర్త్ డే ను ఎందుకు మరిచాడు అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క బన్నీనే కాదు అల్లు శిరీష్, అల్లు స్నేహారెడ్డి ఎవ్వరు పవన్ ను విష్ చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. అంటే మెగాఫ్యామిలీకి- అల్లు ఫ్యామిలీకి మధ్య విబేధాలు ఇంకా ఉన్నాయి.. కానీ వాటిని చెప్పడం లేదు అని చెప్పుకొస్తున్నారు. ఇక మరికొంతమంది నెటిజన్స్ వీరిని తప్పు పడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టనంత మాత్రాన విష్ చేయలేదని ఎలా అనుకుంటారు.. బన్నీ, పర్సనల్ గా విష్ చేసి ఉండొచ్చు.. లేకపోతే వేరే పనిలో బిజీగా ఉండొచ్చు. విష్ చేయనంత మాత్రాన ఇలా మాట్లాడడం పద్దతి కాదని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.