Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో టాప్ 1 సినిమా అంటే ఖుషీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవన్ రేంజ్ ను అమాంతం పెంచేయడమే కాకుండా ప్రేక్షకులను పవన్ అభిమానులుగా మార్చేసింది. పవన్ లుక్, మ్యానరిజం ఇవన్నీ హైలైట్ గా నిలిచిన ఈ సినిమా రీరిలీజ్ చేస్తే.. పవన్ ఫ్యాన్స్ ఆగుతారా..?. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల సినిమాలను ఇప్పుడు 4k సౌండ్ తో చూడడమంటే ఫ్యాన్స్ కు అదో పెద్ద పండుగ. ఇక ఇటీవల సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే సందర్భంగా తమ్ముడు, జల్సా రీ రిలీజ్ అయ్యిన విషయం విదితమే. ఈ థియేటర్లో అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ముందు జల్సా ప్లేస్ లో ఖుషీ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారట మేకర్స్.
ఇక ఈ విషయమై నిర్మాత ఏఎం రత్నం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” మొదట ఖుషీ సినిమాను రీ రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ, అప్పటికే తమ్ముడు, జల్సా రిలీజ్ అవ్వడంతో ఒకేసారి అన్ని సినిమాలు ఎందుకు అని మౌనంగా ఉండిపోయాను. వచ్చే ఏడాది పవన్ బర్త్ డేకు ఖుషీ ని మాస్టర్ వెర్షన్ లో అభిమానులకు అందిస్తాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏఎం నిర్మాతగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో మరో హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.