ముఖ్యమంత్రి కావాలనే చంద్రబాబు కలనే పవన్ కల్యాణ్ కంటున్నాడు అంటూ సెటైర్లు వేశారు సజ్జల.. తనకు బలం లేదని పవన్ అంగీకరించారన్న ఆయన.. తనను ముఖ్యమంత్రిని చేయాలనే అభిమానులను చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నాడని కామెంట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Pawan Kalyan: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే, జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్.. వారిపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. నేను సంపూర్ణమైన రైతును కాను.. కానీ, కష్టాల్లో ఉన్న రైతుల బాధ అర్ధం చేసుకునే మానవతా వాదిని అన్నారు.. అన్నీ తెలుసనంటున్న వైసీపీ నేతలు రైతులకేం చేశారు అని నిలదీశారు పవన్.. అకాల వర్షాల వల్ల రైతులు…
Harish Shankar: ప్రస్తుతం ట్విట్టర్ లో ఎక్కడ చూసినా డైరెక్టర్ హరీష్ శంకర్ గురించే చర్చ. గబ్బర్ సింగ్ లాంటి భారీ విజయం తరువాత హరీష్ శంకర్ అంతటి ఇండస్ట్రీ హిట్ ను అందించలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక పవన్ కళ్యాణ్ కు .. వరుస ప్లాప్ ల నుంచి బయటపడేసింది హరీష్ శంకరే.
కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం అన్నారు జనసేనాని.. మేం ఒక కులం కోసం పని చేసే పార్టీ కాదన్న ఆయన.. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపడతామని ప్రకటించారు.. మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ.. కొన్ని జిల్లాల్లో తక్కువ.. కానీ, జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు. పవన్ కల్యాణ్‌ను రైతులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. అసలు పవన్ కు రాజకీయ అవగాహన లేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. మరి అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడ లేదు? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఏమి చేశారో…
Ustaad Bhagatsingh: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పాట పాడేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన కాంబో పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌కు 10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేడని విమర్శించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పంటలు ఎలా పండిస్తారో కూడా పవన్‌కు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. ఒకప్పుడు పవన్ రాజకీయాల్లో ఉండడంతో ఆయన సినిమాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా రాకపోవడంతో పవన్ నిరాశలో కూరుకుపోయారు.
Pawan Kalyan: తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.. మీరు వస్తున్నారని ధాన్యం కొనుగోలు వేగవంతం చేశారని పవన్ కి తెలిపారు రైతులు.. ఇంకా కోతలు కోయాల్సి వుందని, గోనె సంచులు ఇవ్వడంలేదు గోడు వెళ్లబోసుకున్నారు.. నూక , ట్రాన్స్ పోర్ట్ పేరుతో రైతులని మిల్లర్లు దొచేస్తున్నరని…
ఇరవై మూడేళ్ళ క్రితం 'తొలిప్రేమ'లో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి... ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో హీరో సంతోష్ శోభన్ అక్కగా నటించింది. కుటుంబ బాధ్యతలు తీరిపోవడంతో తిరిగి నటించడం మొదలు పెట్టానని వాసుకి చెబుతోంది.