BroTheAvatar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ నటుడు సముతిర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో పవన్ దేవుడిగా నటిస్తుండగా.. తేజ్.. మార్క్ అనే డాక్టర్ గా కనిపిస్తున్నాడు . ఇక ఈ సినిమాలో తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇక ఇప్పటికే పవన్ ఈ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేసాడని టాక్.. షూటింగ్ మొదలుపెట్టి రెండు నెలలు కూడా కాకముందే మేకర్స్ డబ్బింగ్ ను షురూ చేశారు. తాజాగా డబ్బింగ్ ను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు.
Samantha: ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా బాబు.. ఆమెకు తల్లిగా సమంత..?
డబ్బింగ్ పనుల కోసం పూజ మొదలయ్యింది అని మేకర్స్ ట్వీట్ చేశారు. అయితే ఈ పూజలో పవన్, తేజ్ తప్ప మిగతావారందరు ఉన్నారు. అంటే.. ఒక్కొక్కరిగా డబ్బింగ్ ను ఫినిష్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ మధ్యనే షూటింగ్ మొదలుపెట్టి.. అంత త్వరగా డబ్బింగ్ కూడా చేసేస్తున్నారు.. ఇంకోపక్క పోస్టర్స్ తో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇక వీరి స్పీడు చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ మామఅల్లుళ్లు ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.
Dubbing works for #BroTheAvatar commences with a Pooja Ceremony today 🥳
Worldwide Release on July 28th 💥@PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @bkrsatish @neeta_lulla @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/UYCalAhaCT
— People Media Factory (@peoplemediafcy) May 30, 2023