Gudivada Amarnath Reacts On YCP Janasena Flexy Controversy: వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వివాదంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు ఉన్నమాట అంటే ఉలుకేందుకు? అని ప్రశ్నించారు. టీడీపీకి పవన్ కళ్యాణ్ సీనియర్ కార్యకర్త అని.. ఆ పార్టీ జెండా పట్టుకొని తిరగాలే కానీ, ఏదైనా అంటే కోప్పడకూడదని హితవు పలికారు. టీడీపీ జెండా పట్టుకుని పవన్ తిరుగుతున్నాడని.. చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ ఉన్నాడని అన్నారు. చంద్రబాబును, లోకేష్‌ను ఎత్తుకుని తిరుగుదామని పవన్ ఉన్నాడన్నారు. టీడీపీ, జనసేన ఇద్దరి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇదేనని పవన్ చెప్పాలని కోరారు. పవన్ చేద్దామనుకున్న పని గురించే తాము ఫ్లెక్సీలో చెప్పామని స్పష్టం చేశారు. ఒకవేళ టీడీపీతో సంబంధం లేకపోతే.. జనసేన 175 స్థానాల్లోనూ పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
Merugu Nagarjuna: చంద్రబాబు పార్టీ శవపేటికలా ఉంది.. మంత్రి నాగార్జున ధ్వజం
ఇదే సమయంలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై కూడా మంత్రి అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ అంటే నిజమని, చంద్రబాబు అంటే అబద్దమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏ మేనిఫెస్టోని తీసుకొచ్చినా ప్రజలు నమ్మరని తేల్చి చెప్పారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ ఏ మేనిఫెస్టో తెచ్చినా.. ప్రజలు చంద్రబాబు ముఖం చూడరన్నారు. చంద్రబాబు ఎందుకంత తాపత్రయ పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. గతంలో ఎప్పుడైనా ఎన్నికల సమయంలో చెప్పిన మేనిఫెస్టోలను చంద్రబాబు అమలు చేశారా? అని ప్రశ్నించారు. గోవా నుంచి ఒకటి, కర్నాటక నుంచి ఒకటి, కేరళ నుంచి మరొకటి, ఏపీలో తాము అమలు చేస్తున్న పథకాల పేర్లను మార్చి చెప్తున్నారని ఎద్దేవా చేశారు. వినే వాళ్లుంటే.. ఐదు కేజీల బంగారం, పది కేజీల వెండి కూడా ఇస్తానని చంద్రబాబు అంటాడన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి, ప్రజలు మోసపోయే పరిస్దితుల్లో లేరని మంత్రి అమర్నాథ్ చెప్పుకొచ్చారు.
Gudivada Amarnath: చంద్రబాబులా అబద్ధాలు చెప్పే అలవాటు మాకు లేదు.. అమర్నాథ్ కౌంటర్