బుల్లితెరపై టాప్ మేల్ యాంకర్ లలో మొదటగా వినిపించే పేరు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తూ, జనాలను అల్లరిస్తున్నాడు.. ఒక యాంకర్గా, యాక్టర్ గా రానిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.. అయితే ప్రదీప్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
అదేంటంటే.. ప్రదీప్ పవన్ కళ్యాణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహారిస్తున్నారని టాక్.. ఇప్పటివరకు పలు టీవీ షోలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రదీప్ ఇప్పుడు సినిమాకు అంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు.. సినిమా తియ్యడం అంటే అంత ఈజీ కాదు.. కొన్ని వందల కోట్ల పైమాటే.. అందులో పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాటలా.. అలాంటి సినిమాను ప్రదీప్ నిర్మించనున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది..సినిమా తీసే రేంజులో ఒక యాంకర్ ఉన్నారు.. అంటే ప్రదీప్ ఒక షో ద్వారా ఎంత సంపాదిస్తున్నాడో అని గుసగుసలు వినిపిస్తున్నాయి..
ప్రదీప్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని చెప్పడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..బుల్లితెరపై ప్రదీప్ ఎన్నో షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జీ తెలుగు లో ప్రసారమయ్యే ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ అనే ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.. ఆ షో తనకు మంచి పేరును తీసుకొని వచ్చింది. అంతేకాదు ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రం ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాడు.అలా హీరో గా,యాంకర్ గా మరియు నిర్మాతగా కూడా సక్సెస్ ని అందుకున్న ప్రదీప్ కు ఒక సినిమాని నిర్మించాలనే కోరిక ఉందని, తన మొదటి సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అని చాలా సందర్భాల్లో చెప్పాడు.. మరి ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే ప్రదీప్ క్లారిటి ఇచ్చేవరకు ఆగాల్సిందే..