Pawan Kalyan: భారత కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పీకర్ సీటు దగ్గర ‘సెంగోల్’ ఉంచుతారు. భారత గొప్ప సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన సెంగోల్‌ను నూతన పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రాజదండం స్వేచ్ఛకు చిహ్నం అని చెప్పారు. సెంగోల్ ను సముచిత స్థానంలో ఉంచుతామన్నారు. ఈ సెంగోల్ మనం కర్తవ్య మార్గంలో నడవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని గుర్తు చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఇక, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.. ఈ ఘటాన్ని భరత మాతకు మరో మణి హారంగా అభివర్ణించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
భరత మాతకు మరో మణి హారం నూతన పార్లమెంట్ భవనం అని పేర్కొన్నారు పవన్ .. వీరుల త్యాగఫలంతో స్వతంత్రతను సాధించిన భారతావని సగర్వంగా వజ్రోత్సవాన్ని జరుపుకోంది.. ఈ 75 వసంతాలలో ఎన్నో మార్పులు.. మరెన్నో చేర్పులు. పరాయి పాలకుల క్రీనీడలను పారదోలుతూ ఎన్నో కొంగొత్త నిర్ణయాలు తీసుకొని.. విజయాలు అందుకున్నాం అన్నారు. అగ్రగామి దేశంగా వెలుగొందడానికి అవిరళ కృషి చేస్తున్న సమయాన మన భరతమాత మెడలోని హారంలో మరో కొత్త సుమం చేరుతోందని అభివర్ణించారు. రాజ్యాంగ నిలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన శుభ తరుణాన జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.. త్రికోణాకారంలో రూపుదిద్దుకున్న ఈ మహాకృతి నిర్మాణానికి సంకల్పించిన నరేంద్ర మోడీకి శుభాభినందనలు.. భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చరితార్ధులుగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.