TDP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్ది.. నేతల్లో టెన్షన్ పెరుగుతోంది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థులను ఖరారు చేసేపనిలో బిజీగా ఉంది.. ఇప్పటికే ఐదు జాబితాలను విడుదల చేసింది వైసీపీ అధిష్టానం.. మార్పులు, చేర్పులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోందట.. హైదరాబాద్‌లో నిన్నంతా సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఖరారు పైనే పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబును కలిసేందుకు వివిధ నియోజకవర్గాల నేతలు.. ఆశావహుల ప్రయత్నం చేస్తు్న్నారు.. క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ నేతలు. కసరత్తు చివరకు దశకు రావడంతో పార్టీ హైకమాండ్ పై నేతలు ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోంది..
మరోవైపు.. జనసేన పార్టీ ఆశిస్తున్న సీట్లపై పీఠముడి నెలకొంది.. సిట్టింగ్ ఎమ్మెల్యేల వరకు చంద్రబాబు భరోసా ఇచ్చారట.. ఎంపీ స్థానాల విషయంలోనూ టీడీపీ కసరత్తు కొలిక్కివస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేల చేరికలు ఉండడంతో ఆచి తూచి కసరత్తు చేస్తోంది టీడీపీ.. ఇక, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చే విషయంలో పాత లీడర్లు.. కేడర్ మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని అధిష్టానం స్పష్టంగా చెబుతోందట. అభ్యర్థుల ఖారారు చేస్తూ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు చూపిస్తోన్న నేపథ్యంలో.. టీడీపీ కూడా సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించింది..