Nallapareddy Prasanna Kumar Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక్క ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తామంటున్నారు.. బంగారంగా తీసుకోండి.. ఓటు మాంత్రం ఫ్యాన్‌కు వేయండి అని పిలుపునిచ్చారు.. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా విడవలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైయస్సార్ ఆసరా కింద నాలుగో విడత చెక్కులను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగున్నర ఏళ్ల పాటు ప్రజలకు కనపడని ప్రతిపక్ష నేతలు నేడు పగటి వేషగాళ్లలా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలించాడు.. ఐదు సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో పరిపాలించాడు.. వాగ్దానాలు చేయటం.. ఓట్లు వేయించుకోవడం అధికారంలో వచ్చిన తర్వాత మోసం చేయటం పరిపాటిగా మారిందంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో కుటుంబాలు బాగుపడ్డాయా..? వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లాగా సంక్షేమ పథకాలు ఇచ్చారా..? అని నిలదీశారు.
Read Also: KCR: అసెంబ్లీ వద్ద సందడి.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం
ఇక, మహిళల పేరు మీదే వైఎస్ జగన్ పథకాలు ఇస్తున్నారని గుర్తుచేశారు ప్రసన్నకుమార్ రెడ్డి.. రెండు ఎకరాల ఆసామి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అయ్యాడు అని విమర్శించారు. మరోవైపు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇస్తామంటున్నారు.. ఆ డబ్బులను బంగారంగా తీసుకోండి.. ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేయండి అని సూచించారు.. ఎందకంటే.. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే అని ఆరోపించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.