Janasena: జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Kayagurala Lakshmipathi Joins Janasena: కేఎల్‌పీ మూవీస్ సంస్థ అధినేత, నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు. సోమవారం (జనవరి 29) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపతి తండ్రి గారు కీ.శే. శ్రీ కె. నారాయణస్వామి గారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో నిర్మాత లక్ష్మీపతి కూడా ప్రజాసేవ చేయడానికి నేడు జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీలో చేరిన సందర్భంగా కాయగూరలు లక్ష్మీపతి మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అభిమానం. గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నా. సినిమా అంటే ఇష్టంతో ఐక్యూ సినిమాను నిర్మించా. ఇంకా రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ లభిస్తోంది. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. బిజినెస్ రంగంలో నాకు సపోర్ట్ చేస్తున్న నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు. సినిమాలు నిర్మిస్తూనే.. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తా. ప్రజల కోసం పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. జనసేన పార్టీ నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
Also Read: MK Stalin-Djokovic: ఆకాశంలో ఆశ్చర్యం.. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌ను కలిసిన తమిళనాడు సీఎం!
కాయగూరల లక్ష్మీపతి గతంలో ఆర్టిఏ బోర్డు మెంబర్‌గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా అనంతపురం పట్టణ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేశారు. అనంతపురంలో ప్రభుత్వ స్థలంలో శాశ్వత ఆర్టిఓ కార్యాలయంను నిర్మించుటకు కృషి చేసి.. నిర్మాణం పూర్తి చేశారు. టెలికం ఎస్టిడి, ఐఎస్డి కమిటీ మెంబర్‌గా పని చేసిన కాలంలో పార్టీ కార్యకర్తలకు ఎస్టిడి బూతులు కేటాయించి బ్యాంకు రుణాలు ఇప్పించారు. కెఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో పేదలకు నీళ్ల ట్యాంకు నిర్మాణం, దుప్పట్లు, చేతి కర్రలు పంచారు. అఖిలభారత కాపు సమాఖ్యలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూ.. కాపు, బలిజల సంఘాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!