ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న జనసేన ఎన్నికల శంఖారావం పూరించనుంది. అందుకోసం అనకాపల్లిలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనలతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు జనసేనాని.
Anil Kumar Yadav: నిన్నటి దాక అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతా..
ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదం ప్రకటించడం ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. కాగా.. అనకాపల్లిలో నిర్వహించేబోయే బహిరంగ సభలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా.. బహిరంగ సభ ఏర్పాట్ల కోసం రేపు అనకాపల్లిలో సన్నాహక సమావేశం నిర్వహించనుంది జనసేన పార్టీ.
YCP: రేపు సీఎం జగన్తో నెల్లూరు నేతల భేటీ..