Tamil Nadu: “రజనీకాంత్‌ను బెదిరించిన డీఎంకే”.. విజయ్ పార్టీ కొత్త వివాదం..
- రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీని అడ్డుకున్న డీఎంకే..
- సూపర్ స్టార్‌ను డీఎంకే బెదిరించింది..
- తమిళనాడులో వివాదాస్పదంగా టీవీకే నేత కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసేందుక రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే, తమిళనాడులో మాత్రం ఓ విషయం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. సినీ నటుడు విజయ్ కు చెందిన తమిళగా వెట్రి కజగం (TVK) సీనియర్ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచించినప్పుడు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఆయన్ను బెదిరించిందని ఆరోపించారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
టీవీకే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్ అర్జున, మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పార్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత డీఎంకే నేతలు, రజనీకాంత్ అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ‘‘తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ శకం ముగిసిన తర్వాత, రజనీకాంత్ ఒక ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిగా ఎదగాలని, వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని ఆశించారు. కానీ ఇప్పుడు రజనీకాంత్ రెడ్ జాయింట్ సంస్థతో మూవీస్ చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు. రెడ్ జాయింట్ సంస్థ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు చెందినది.
అయితే, రజనీకాంత్‌ను విమర్శించడం తన ఉద్దేశ్యం కాదని, విజయ్ రాజకీయ ధైర్యాన్ని హైలెట్ చేయడమే తన ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రజనీకాంత్ మాజీ సలహాదారు ఆర్ అర్జునమూర్తి ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. విజయ్ అర్జునపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు మంత్రి ఎస్. రేగుపతి కూడా ఆరోపణలను తిరస్కరించారు, టీవీకే తప్పుడు వాదనలను వ్యాప్తి చేయడం ద్వారా రాజకీయ మైలేజ్ పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రజనీకాంత్ డీఎంకేతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారని, 1996 ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!