రాష్ట్ర పరిస్థితులపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి వస్తే పవన్ కల్యాణ్ సిద్ధం అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పరిపాలన ఎంత గొప్పగా ఉందో వాళ్ళు చెబుతారు.. ఎంత చెత్తగా ఉందో మేం చూపిస్తామని చెప్పారు. కాగా.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడటం 98శాతం ఖాయమని అన్నారు. 2014లో వచ్చిన ఫలితాల కంటే 30శాతం అధికంగా సీట్లు సాధిస్తాం అని ధీమావ్యక్తం చేశారు.
Read Also: Anam Ramanarayana Reddy: వైసీపీ నుంచి నేను తప్పుకోలేదు.. షాకింగ్ కామెంట్స్
మోడీ పరిపాలన దక్షత, ఆయన పట్ల తమకు ఉన్న ప్రత్యేక అభిమానం కలిసి పొత్తులు ఏర్పడుతున్నాయని నాగబాబు పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటులో ఇబ్బందులు సహజం అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. మరోవైపు.. 40 సీట్లు జనసేనకు ఇవ్వాలనేది హరిరామజోగయ్య వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. పెద్దలుగా జోగయ్య సూచనలను గౌరవిస్తాం.. కానీ తమ ప్రాధాన్యత వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పారు.
Read Also: Delhi: మెట్రో స్టేషన్‌లో ప్రమాదం.. ప్రహారీ గోడ కూలి ఒకరు మృతి
2019 కంటే ఇప్పుడు ఏపీలో బీజేపీ, జనసేన బలం బాగా పెరిగిందని నాగబాబు పేర్కొన్నారు. కాగా.. తాను ఎన్నికల్లో పోటీపై మాట్లాడుతూ, అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఇప్పటి వరకు అయితే లేదు.. అధ్యక్షుడు ఆదేశం మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. పవర్ షేరింగ్, పవన్ సీఎం కంటే ప్రజా వ్యతిరేక వైసీపీ ఓటమి జనసేన కీలకంగా భావిస్తోందని నాగబాబు తెలిపారు.