ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. జనసేన-టీడీపీ- బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ కళ్యాణ్‌తో చర్చించడం జరిగిందని ఆయన వెల్లడించారు. 40 నుంచి 60 సీట్లు జనసేన దక్కించుకోవలసి ఉందని చెప్పగా.. 40 సీట్ల వరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ తెలిపారన్నారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి వెళ్లారు. ముద్రగడ, బొలిశెట్టి ఇద్దరే అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. ముద్రగడను బొల్లిశెట్టి కలవడం ఇది రెండోసారి.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు నాగవంశీ ఈ సినిమాను నిర్మించగా.. థమన్ సంగీతం అందించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈరోజు గుంటూరు కారం రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారా? ఆయన ఇంటికి వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న తాజా పరిణామం ఇది.
ముద్రగడతో టచ్‌లోకి వెళ్లారు జనసేన పార్టీ నేతలు.. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్‌తో సహా పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ.. జనసేన నేతలతో ఏకాంత చర్యలు జరిపినట్టు తెలుస్తోంది.
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం అంబటి రాయుడికి పవన్ కళ్యాణ్ వినాయకుడి వెండి ప్రతిమను బహూకరించారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశం వివరాల గురించి అంబటి రాయుడు తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్లో తెలిపారు.