Cameraman Gangatho Rambabu: ఈ మధ్య కొత్త సినిమాల కంటే.. రీరిలీజ్ సినిమాలకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. థియేటర్ వద్ద రీరిలీజ్ సినిమాలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల పాత సినిమా రీరిలీజ్ అవుతుంది అనడం ఆలస్యం ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక ఆరోజు థియేటర్ లో ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. కొంతమంది అయితే థియేటర్ లో క్రాకర్స్ కాల్చడం, సీట్లు చించేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రీరిలీజ్ థియేటర్ లో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. థియేటర్ మొత్తాన్ని మంటలతో తగలబెట్టారు. పేపర్స్ తీసుకొచ్చి.. వాటిని మంటల్లో వేయడం వాటి చుట్టూ డ్యాన్స్ వేస్తూ.. రచ్చ చేశారు. దీంతో థియేటర్ ఓనర్స్ షో ఆపేశారు. అయినా కూడా ఫ్యాన్స్ ఆగకుండా రచ్చ చేయడం హాట్ టాపిక్ గామారింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇది చూసిన నెటిజన్స్ ఓరి మీ ఫ్యానిజం పాడుగాను.. థియేటర్ ను తగలబెట్టారు ఏంట్రా అంటూ కొందరు.. ఇలా అయితే థియేటర్స్ ఇవ్వరు .. ఇలా చేయకండి అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.
ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2012 లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ రీరిలీజ్ చేశాడు. రాంబాబుగా పవన్ కళ్యాణ్, గంగ పాత్రలో తమన్నా కనిపించి అలరించారు. రాజకీయ నాయకులను ఏకిపారేసే ధైర్యం ఉన్న కెమెరామెన్ గా పవన్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి సేల్ అయిన ప్రతి టిక్కెట్ నుంచి 10 రూపాయలు జనసేనకు ఫార్టీ ఫండ్ ను అందజేస్తామని నట్టికుమార్ తెలిపాడు. మరి ఈ సినిమా కలక్షన్స్ ఎంత వచ్చాయి అనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.
Show Apesadu ra Tikka Huk gallara 😭#CameramanGangathoRambabu pic.twitter.com/F74DagxwrI
— జల్సా🚶🏻♂️🇦🇷 (@Jalsa44) February 7, 2024