Nagababu: మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్ కల్యాన్ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు.. వైసీపీ ఏడో జాబితా కాదు.. లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదన్నారు. జనసేన ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో మా అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే.. పరిష్కరించుకొని ముందుకు వెళ్తాం అన్నారు. టీడీపీ-జనసే కూటమితో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కలిసి వస్తుందని భావిస్తున్నాం అన్నారు.. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను మా అధినేత ప్రకటిస్తారన్న ఆయన.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంది.. కాబట్టి, టీడీపీ నేత చింతకాయల విజయ్ తో మర్యాద పూర్వకంగానే కలిశాం అన్నారు. ఇదే సమయంలో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ అంశం చర్చకు రాలేదు అన్నారు. ఇక, నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్ని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.
Read Also: Yatra2 Movie Review: యాత్ర2 మూవీ రివ్యూ..
ఇక, అన్ని రంగాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని బుధవారం మండిపడ్డారు నాగాబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం జరగబోతోంది.. అద్భుతం జరిగేటప్పుడు అందరూ సహకరించాలి.. పవన్ కల్యాణ్ కోసం నేను ఏమి చేయడానికి అయినా రెడీ అని ప్రకటించారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.. వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర జాతికి ప్రమాదకరం అన్నారు. కరోనా వైరస్ తరువాత ప్రమాదకర వైరస్ వైసీపీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వైరస్ కు జనసేన, టీడీపీయే అసలైన మందుగా అభివర్ణించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు తప్ప.. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని దుయ్యబట్టారు నాగబాబు..