సాదారణంగా కాంబోలో వచ్చే సినిమాలకు ఒక లెక్క ఉంటుంది.. ఫ్యాన్స్ కు ఫుల్ పండగే అన్న విషయం తెలిసిందే.. ఇద్దరు స్టార్ హీరోలు ఓకే స్క్రీన్ పై కనిపిస్తే ఇక వారి ఆనందానికి హద్దులు ఉండవని చెప్పొచ్చు. అంత రచ్చ చేస్తారు మరి. అది కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉంటారు.. తాజాగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని ఓ పోస్టర్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు.. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది..
ఇకపోతే ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఫుల్ బ్లాక్ కాస్ట్యూమ్ తో ఉన్నారు. అదేవిధంగా గతంలో సాహో సినిమాలో ప్రభాస్ సైతం బ్లాక్ కాస్ట్యూమ్ లో ఉన్న ఫోటో ని తీసుకుని పవన్ , ప్రభాస్ ని పెట్టి ఫుల్ కిక్ ఇచ్చారు ట్రోలర్స్. ఇక ఈ పోస్టర్ని చూసిన కొందరు ఇది కనుక నిజమైతే థియేటర్లు దద్దరిల్లి పోతాయని చెబుతున్నారు.. ఓజీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మరియు సాహోలో ప్రభాస్ క్యారెక్టర్. వీరిద్దరి సినిమాలలో కూడా ఎక్కువగా వెపన్స్ యూస్ చేసేదట్లు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే సూపర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏమో ప్రభాస్ కి బ్రదర్ అవుతాడు..
ఈ సినిమాకు ఒక డైలాగు కూడా ఉంది.. ఇద్దరు అన్నదమ్ములు రౌడీలు.. రౌడీ ప్రభాస్ ఫేస్ చూసిన వెంటనే భయపడి.. అందరికీ ఓ డైలాగ్ చెబుతాడు. ‘ ఇప్పుడు వీడిని మనం చంపి ఇంటికెళ్దాం అనుకుంటున్నారా. అక్కడికి వెళ్లే లోపే అవి స్మశానాలుగా మారి ఉంటాయి. ఆ స్మశానాలలోనే వీడి అన్న మనని పాతేస్తాడు ‘ అని చెప్పుకోస్తాడు. వాడి అన్న అర్జున్ పాల్వి.. అతనే పవన్ కళ్యాణ్.. వీరిద్దరినీ పెట్టి సినిమా తీస్తే ఇక అంతే అంటున్నారు ఫ్యాన్స్.. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..