Nagababu: జనసేన నేత నాగబాబు.. ఆంధ్రప్రదేశ్ మంత్రులపై మండిపడ్డారు.. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మాడుగుల ఆత్మీయ సదస్సులో మాట్లాడుతూ.. మంత్రులపై సీరియస్ కామెంట్స్ చేశారు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు ఆలస్యం అయ్యిందో చెప్పలేని మంత్రి అంబటి రాంబాబు.. నీటి పారుదల శాఖ మంత్రి కాదు.. నోటి పారుదల మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ఇక, ఎక్కువ మంది చదువుకున్న వాళ్లు వుండటం వల్ల నిరుద్యోగిత ఏర్పడింది మంత్రి బొత్స సత్యనారాయణ అనడం విడ్డూరం అని దుయ్యబట్టారు.. ఎక్కువ చదవడం వలన జ్ఞానం వస్తుంది.. కానీ, నిరుద్యోగత ఏర్పడు అని హితవు పలికారు.. ఇక, రోడ్లు వేయలేని మంత్రి బూడి ముత్యాల నాయుడుని కాలర్ పట్టుకోని అడగండి అంటూ పిలుపునిచ్చారు నాగబాబు.
Read Also: INDIA bloc: ఇండియా కూటమికి మరో దెబ్బ.. బీజేపీతో ఆర్ఎల్డీ పొత్తు..
మరోవైపు.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా విడుదల చేస్తున్న పార్టీ అభ్యర్థుల జాబితాపై గతంలో స్పందించిన నాగబాబు.. వైసీపీ ఏడో జాబితా కాదు.. లక్ష జాబితాలు విడుదల చేసినా తమకు నష్టం లేదన్న విషయం విదితమే. ఇక, జనసేన ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని అన్నారు. పార్టీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే.. పరిష్కరించుకొని ముందుకు వెళ్తున్నామని.. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామని నాగబాబు గురువారం పేర్కొన్న విషయం విదితమే.